TDP MLA: టీడీపీ ఎమ్మెల్యే హత్యకు భారీ కుట్ర

నె­ల్లూ­రు రూ­ర­ల్‌ ఎమ్మె­ల్యే కో­టం­రె­డ్డి శ్రీ­ధ­ర్‌­రె­డ్డి హత్య­కు జరి­గిన భారీ కు­ట్ర బహి­ర్గ­త­మైం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చిన వీ­డి­యో సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్‌­గా మా­రిం­ది. ఎమ్మె­ల్యే కో­టం­రె­డ్డి­ని చం­పి­తే డబ్బే డబ్బు అంటూ ఆ వీ­డి­యో­లో రౌ­డీ­షీ­ట­ర్లు మా­ట్లా­డు­కుం­టుం­డ­డం తీ­వ్ర సం­చ­ల­నం­గా మా­రిం­ది. కో­టం­రె­డ్డి­ని చం­పా­ల­ని ఐదు­గు­రు రౌ­డీ­షీ­ట­ర్లు మా­స్ట­ర్‌ ప్లా­న్‌ వే­సి­న­ట్టు పో­లీ­సు­లు, టీ­డీ­పీ శ్రే­ణు­లు అను­మా­ని­స్తు­న్నా­రు. లేడీ డా­న్‌ ని­డి­గుంట అరుణ ద్వా­రా రౌడీ షీ­ట­ర్లు అవి­లేల శ్రీ­కాం­త్‌, జగ­దీ­ష్‌ సహా మరి­కొం­ద­రు రౌ­డీ­షీ­ట­ర్లు పథకం రచిం­చి­న­ట్టు కో­టం­రె­డ్డి వర్గీ­యు­లు గు­ర్తిం­చా­రు. వీ­డి­యో­తో సహా సా­క్ష్యా­లు సే­క­రిం­చా­రు. వెం­ట­నే స్పం­దిం­చ­డం­తో కో­టం­రె­డ్డి ప్రా­ణా­ల­కు ము­ప్పు తొ­ల­గిం­ద­ని చె­బు­తు­న్నా­రు. ఇటీ­వల ఆయ­న­పై వై­సీ­పీ సో­ష­ల్‌ మీ­డి­యా­లో దు­ష్ప్ర­చా­రం జరి­గిం­ది. కో­టం­రె­డ్డి­ని హత్య చే­స్తే వచ్చే ఎన్ని­క­ల్లో గూ­డూ­రు లేదా సూ­ళ్లూ­రు­పేట ఎమ్మె­ల్యే టి­కె­ట్టు ఇస్తా­మ­ని లేడి డాన్ అరు­ణ­కు వై­సీ­పీ కీలక నేత ఒకరు హామీ ఇచ్చి­న­ట్టు ప్ర­చా­రం జరు­గు­తోం­ది. డబ్బు­తో ప్ర­లో­భ­పె­ట్టి కో­టం­రె­డ్డి అను­చ­రు­ల­ను రౌ­డీ­షీ­ట­ర్లు తమ­వై­పు తి­ప్పు­కొ­నే ప్ర­య­త్నం చే­సి­న­ట్టు టీ­డీ­పీ శ్రే­ణు­లు ఆరో­పి­స్తు­న్నా­యి. రౌడీషీటర్ల వీడియో రిలీజ్‌ అంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్‌ తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడుతాం, ఆయన కోరితే రక్షణ కల్పిస్తామని చెప్పారు. మరోవైపు కోటంరెడ్డి అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపేందుకు రౌడీషీటర్లు కుట్ర పన్నడం.. పోలీసులు, నిఘా వర్గాలు దాన్ని గుర్తించకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

మద్యం తాగుతూ చంపేందుకు ప్లాన్

తాజాగా బయటికి వచ్చిన వీడియోలో నెల్లూరులోని ఓ హోటల్ లో భేటీ అయిన దాదాపు 7, 8 మంది రౌడీషీటర్లు.. మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని హతమార్చితే మనకు డబ్బే డబ్బు అంటూ వారు మాట్లాడుకున్నారు. ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను జగదీష్, మహేష్, వినీత్ సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్న జగదీష్.. రౌడీషీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు అని సమాచారం. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో ఇంతకుముందే బయటికి వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇది పోలీసులకు ముందే తెలిసిననట్లు ఆరోపణలు వస్తుండగా.. ఎందుకు చర్యలు చేపట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేడీ రౌడీషీటర్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్‌, అతని అనచురుడు జగదీష్‌ సహా మరికొందరు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు కోటంరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోతో పాటు మరిన్ని సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాము తక్షణమే స్పందించడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగలేదని పేర్కొంటున్నారు. ఇటీవల కోటంరెడ్డిపై వైసీపీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారని పేర్కొంటున్నారు.

Leave a Comment