RTC Bus Fire Breaks: విశాఖలో( Visakhapatnam) రెండు వేర్వేరు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అగ్ని ప్రమాదాల్లో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సుకు మంటలు వ్యాపించాయి. రోడ్డుపైనే బస్సు మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు ఇంటి సమీపంలో పార్కింగ్ చేసిన కారు దగ్ధమైంది. అయితే ఈ రెండు ఘటనలకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకేరోజు రెండు ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
* వందమంది ప్రయాణికులతో వెళ్తుండగా
విశాఖ కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి( Vijayanagaram) ఒక ఆర్టీసీ బస్సు వెళుతుంది. బస్సులో వంద మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే ఆ బస్సు శాంతిపురం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి.. బస్సులో మంటలు కనిపించాయి. దీనిని గుర్తించిన ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ రమేష్ కు చెప్పారు. వెంటనే బస్సు రోడ్డు పక్కకు ఆపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం ప్రారంభం అయ్యాయి. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* కారులో మంటలు..
మరోవైపు విశాఖ సింధియా( Sindhiya) ప్రాంతంలో.. జింక్ గేటు సమీపంలో ఓ కారు దగ్ధం కావడం ఆందోళన వ్యక్తమౌతోంది. గత పది రోజులుగా ఆ కారును తీయలేదు. అయితే ఆ కారును సంబంధిత యజమాని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే కారులో మంటలు వ్యాపించాయి. అయితే అప్పటికే కారులో ఉన్నవారు ఆందోళనతో బయటకు దూకేశారు. ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికి కారు సగానికి పైగా దగ్ధమైంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. విశాఖలో ఒకేరోజు రెండు ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.