
దిశ, వెబ్డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ నెలలో అయినా ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 46
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 70
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 38
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 26
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.02
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 85