Pawan Kalyan TDP Alliance: ప్రతి రాజకీయ పార్టీ నేతకు ఒక వ్యూహం ఉంటుంది. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు కూడా. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువగా అంచనా వేసింది. ఆయనకు అసలు రాజకీయాలే తెలియని జగన్మోహన్ రెడ్డి నుంచి కిందిస్థాయి వైసీపీ నేత వరకు.. అంతా భావించారు. కానీ అదే పవన్ కళ్యాణ్ వ్యూహాలు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టడం లేదు. గత ఎన్నికలకు ముందు టిడిపి తో పొత్తు ప్రకటించారు పవన్ కళ్యాణ్. కానీ వైయస్సార్ కాంగ్రెస్ చాలా తేలిగ్గా తీసుకుంది. రెండు పార్టీలు కలిసినా పర్వాలేదు. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో గొడవలు వస్తాయి అని భావించారు. కానీ సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిపించారు పవన్. కాస్త వెనక్కి తగ్గి తమ బలానికి తగ్గట్టు సీట్లు తీసుకున్నారు. ఓట్లు బదలాయింపు జరగదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగింది. పోనీలే మంత్రి పదవిలో దెబ్బలాడుతారు అని భావించారు. మంత్రి పదవుల విషయంలో సవ్యంగా ముందుకు సాగారు. తప్పకుండా రెండు పార్టీల శ్రేణులు మధ్య గొడవలు వస్తాయి అని అంచనా వేశారు. కానీ 15 నెలల ప్రయాణం సవ్యంగా సాగిపోయింది.
Also Read: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?
* మరో 15 ఏళ్లు కూటమి..
మరో 15 ఏళ్ల పాటు కూటమి( Alliance ) ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కూటమి అనేది రెండు పార్టీల ప్రయోజనాలకు కాదని.. ఈ రాష్ట్రానికి అని.. అంతకుమించి ఈ దేశానికి అని ప్రకటన చేశారు పవన్. అందుకే కూటమి వెచ్చిన ప్రయత్నంలో జనసైనికులు భాగం కావద్దని తేల్చి చెప్పారు. తద్వారా పూర్తి స్పష్టతనిచ్చారు. కూటమి విషయంలో.. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో.. మరో మాటకు తావు లేదని తేల్చి చెప్పారు పవన్. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని కూడా చెప్పుకొచ్చారు. కేవలం పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసేందుకే.. ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం అవుతోంది.
* వైసిపి అంచనాలు తారుమారు..
పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు టిడిపి( Telugu Desam Party) పట్ల దూకుడు ప్రదర్శిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంది. తద్వారా కూటమి విచ్ఛిన్నం అవుతుందని.. అదే జరిగితే తమకున్న సంప్రదాయ ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావచ్చన్నది వైసిపి అంచనా. కానీ ఆదిలోనే దీనిని గుర్తు ఎరిగారు పవన్ కళ్యాణ్. జనసైనికుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న అభిమతం ఉంది. ఈ క్రమంలో జనసైనికుల్లో ఒక రకమైన గందరగోళం ఏర్పరిచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. సోషల్ మీడియా ముసుగులో.. పవన్ అభిమానుల ముసుగులో.. జనసైనికుల ముసుగులో చాలా రకాల ప్రయత్నాలు చేసింది. కానీ దానిని ఎప్పటికప్పుడు అధిగమించారు పవన్ కళ్యాణ్. తప్పుడు ప్రచారాలతో పాటు ప్రకటనలపై ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. అలా చేస్తున్న ప్రచారాల వెనుక వైసీపీ హస్తం ఉందని కూడా పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయిలో స్పష్టతనిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కూడా అసలు విషయాన్ని గ్రహిస్తున్నాయి. కొంతవరకు నియంత్రణలోనే ఉంటున్నాయి.
* అటువంటి నేతలకు చెక్..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉడుం పట్టుతో ఉన్నారు. టిడిపిని వ్యతిరేకించే జనసేన( janasena ) బ్యాచ్ ఉండేది. వారిని నియంత్రించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. అయితే సహించుకోలేని నేతలు బయటకు వెళ్లిపోయారు. మరికొందరినీ పవన్ బలవంతంగానే బయటకు పంపించేశారు. ఇప్పుడు జనసేన అంటే పవన్ ఆదేశాలను పాటించే ఒక సైన్యం. ఈ విషయంలో ఎమ్మెల్యేలకు సైతం మినహాయింపు లేదు. అందుకే కూటమి మరో 15 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నారు. దానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా సంకేతాలు ఇస్తున్నారు పవన్. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్న మాదిరిగా జరిగే పరిస్థితి లేదు. అక్కడ పవన్ తనకంటూ ఒక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.