Desha Disha

Mukesh Ambani at AGM 50 కోట్ల కస్టమర్లను రీచ్ అయిన జియో.. జియో

జియో డీప్‌ టెక్‌ కంపెనీగా మారిందని ఇప్పుడు స్పష్టమైందని ఆకాశ్ అంబానీ అన్నారు. జియో టెక్నాలజీ స్టాక్‌ను పూర్తిగా భారత్‌లో జియో ఇంజనీర్లు డిజైన్‌, డెవలప్‌, డిప్లాయ్‌ చేశారని వివరించారు.

Mukesh Ambani at AGM 50 కోట్ల కస్టమర్లను రీచ్ అయిన జియో.. జియో

Mukesh Ambani at AGM

Updated On : August 29, 2025 / 3:04 PM IST

Mukesh Ambani at AGM: రిలయన్స్‌ జియో 500 మిలియన్‌ సబ్‌స్క్రైబర్ల (50 కోట్లు) మైలురాయిని దాటిందని కంపెనీ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ తెలిపారు.

సబ్‌స్క్రైబర్‌ సంఖ్య విషయంలో జియో ఫైనాన్షియల్ ఇయర్‌ 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 మధ్య 488 మిలియన్‌గా ఉందని వార్షిక నివేదికలో ఆ కంపెనీ పేర్కొంది. అందులో 191 మిలియన్‌ మంది 5జీ నెట్‌వర్క్‌ వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు మరింత పెరిగింది.

రిలయన్స్‌ జియో 2026 జూన్‌ నాటికి భారతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌ అవుతుంది ముకేశ్‌ అంబానీ చెప్పారు.

“జియో గ్లోబల్‌ కంపెనీల మాదిరిగానే వాల్యూను సృష్టించగలదని ఇది రుజువు చేస్తుంది. ఇది పెట్టుబడిదారులందరికీ మంచి అవకాశమవుతుంది” అని ముకేశ్ అంబానీ అన్నారు. రిలయన్స్‌ జియో వచ్చే వారం 10వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

Also Read: రుషికొండపై భవనాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. కరెంట్ బిల్లే రూ. 15లక్షలు..

మరోవైపు, జియో టెక్నాలజీలు ప్రపంచవ్యాప్తంగా వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని ఆకాశ్ అంబానీ అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో జియో సేవలను అంతర్జాతీయంగా విస్తరిస్తామని, భాగస్వాములు, షేర్‌హోల్డర్లకు వాల్యూ సృష్టిస్తామని ఆకాశ్ అంబానీ అన్నారు.

జియో మాత్రమే 24 గంటల్లో గిగాబిట్‌ స్పీడ్‌ ఇంటర్నెట్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించగలిగే ఆపరేటర్‌ అని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలు, ఎంటర్‌ప్రైజుల కోసం జియో సింపుల్‌, స్కేలబుల్‌, సెక్యూర్‌ ప్లాట్‌ఫారమ్స్‌ను నిర్మిస్తోందని చెప్పారు.

జియో డీప్‌ టెక్‌ కంపెనీగా మారిందని ఇప్పుడు స్పష్టమైందని ఆకాశ్ అంబానీ అన్నారు. జియో టెక్నాలజీ స్టాక్‌ను పూర్తిగా భారత్‌లో జియో ఇంజనీర్లు డిజైన్‌, డెవలప్‌, డిప్లాయ్‌ చేశారని వివరించారు.

Exit mobile version