మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపడతారు. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. తోబుట్టువులతో ఆస్తి వివా దాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య మైన వ్యవ హారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పొందుతారు. వృత్తి జీవితం తీరిక లేకుండా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. దాయాదులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనన్నాయి. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఇవి కూడా చదవండి
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరిం చుకుంటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి వసూలవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలతో గానీ ఏ పనీ పూర్తి కాదు. ఉద్యో గంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా పురోగమి స్తాయి. సొంత పనుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల చదువులు సజావుగా సాగిపో తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధువుల నుంచి మీకు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఉద్యోగంలో పనిభారం, ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి. అధికారుల ఆదరణతో పాటు హోదా కూడా పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అంచనాలకు మించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగం వంటి వృత్తుల వారికి సమయం బాగా అనుకూ లంగా ఉంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుం టాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ప్రోత్సాహక రంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను, కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. అద నపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవు తుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలి స్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుం బసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. అవస రాలకు తగ్గట్టు చేతికి డబ్బు అందుతూ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ వాగ్దానాలు ఉండకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలను, కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగు తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరు గుతాయి. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. కొందరు బంధువుతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగు తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.