Health Tips: మీలో విటమిన్-సి లోపం ఉంటే యమ డేంజర్.. తస్మాత్ జాగ్రత్త.. లక్షణాలు ఇవే! – Telugu News | Find out what health problems can occur if your body is low in vitamin C.

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ సి కూడా ఒకటి. ఇది మన బాడీలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, చర్మం, జుట్టు, గోర్లు, చిగుళ్ళు, మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. కానీ శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే, వివిధ రకాల ఆరోగ్య సమస్యల వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అవి ఏంటి, ఈ విటమిన్‌ లోపం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

విటమిన్‌ సీ లోపం వల్ల కలిగే జబ్బులు

  • జలుబు, తక్కువ రోగనిరోధక శక్తి: మీరు తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే మీకు.. విటమిన్ సి లోపం ఉందని తెలియజేయడానికి సంకేతం కావచ్చు. కాబట్టి మీరు ఇలాంటి జబ్బులను ఎదుర్కుంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచింది.
  • గాయాలు మానేందు ఎక్కువ సమయం తీసుకోవడం: విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది గాయాలు వేగంగా మానడానికి సహాయపడుతుంది. అయితే మీకు దెబ్బలు తగిలినప్పుడు.. అవి నయం అయ్యేందుకు ఎక్కువ సమయం పడితే.. ఇది కూడా విటమిన్ సి లోపాన్ని సూచిస్తుంది.
  • రక్తస్రావం అయ్యే చిగుళ్ళు: మీరు మంచి నోటి పరిశుభ్రతను పాటించినప్పటికీ, మీ చిగుళ్ళు వాపు, లేదా నొప్పి, రక్తస్రావం అయితే, ఇది కూడా విటమిన్ సి లోపం హెచ్చరిక సంకేతం కావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
  • పొడి చర్మం: విటమిన్ సి తక్కువ స్థాయిలో ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, దీనివల్ల చర్మం పొడిగా మారుతుంది. కొన్నిసార్లు చిన్న ఎర్రటి మచ్చలు కూడా కనిపించవచ్చు. ఇది కూడా విటమిన్‌ సి లోపానికి సంకేతం కావచ్చు.
  • జుట్టు, గోళ్లు విరిగిపోతాయి: మీకు తగినంత విటమిన్ సి లభించకపోతే, మీ జుట్టు పొడిగా మారి సులభంగా విరిగిపోతుంది. అంతేకాకుండా మీ జుట్టు బలహీనంగా మారి రాలిపోయి ప్రమాదం కూడా ఉంటుంది. దానితో పాటు మీ గోళ్లు కూడా సులభంగా విరిగిపోవచ్చు. ఇది కూడా విటమిన్‌ సి లోపానికి సంకేతం కావచ్చు.
  • అలసట, మానసిక స్థితిలో మార్పులు: శక్తిని నిర్వహించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి విటమిన్ సి చాలా అవసరం. ఒక వేళ మీ శరీరంలో విటమిన్‌ సి శాతం తక్కువగా ఉంటే.. మీరు ఎక్కువ అలసట, చిరాకు, నిరాశకు లోనవుతారు.

ఈ ఆహార పదార్థాల ద్వారా విటమిన్ సి లోపాన్ని పరిష్కరించుకోండి

  • నిమ్మకాయలు, నారింజ, దానిమ్మ వంటి సిట్రస్ పండ్లను ప్రతిరోజూ తినడం
  • ఆమ్లా (ఉసిరికాయ) ఇది విటమిన్-సి గొప్ప సహజ మూలం. కాబట్టి దీన్ని తినడం అలవాటు చేసుకోండి
  • జామ, బొప్పాయి, కివి, స్ట్రాబెర్రీ వంటి పండ్లును తినడం ప్రారంభించండి
  • బెల్ పెప్పర్స్, బ్రోకలీ, టమోటాలు, పాలకూర వంటి కూరగాయలు మీ రోజువారి ఆహారంలో తీసుకోండి

విటమిన్ సి పొందడానికి అలవర్చుకోవాల్సిన అలవాట్లు

  • ప్రతిరోజూ మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే కనీసం ఒకటి లేదా రెండు పండ్లను చేర్చుకోండి.
  • వంట చేసేటప్పుడు, కూరగాయలను ఎక్కువగా ఉడికించవద్దు, బదులుగా విటమిన్ సి కోల్పోకుండా ఉండటానికి వాటిని తేలికగా ఆవిరి చేయండి.
  • ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు శరీరంలోని విటమిన్ సి స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి, వాటికి దూరంగా ఉండటం మంచిది.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్ట్రైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[

Leave a Comment