ఉదయం లేవగానే టీ, కాఫీ తాగకపోతే రోజు ప్రారంభించలేనట్టు(Health Tips) అనిపించదు చాలా మందికి. వేడి వేడి టీ, కాఫీ అలా పెదాలను

Health Tips: Health problems caused by drinking tea/coffee on an empty stomach
Updated On : August 28, 2025 / 9:55 AM IST
Health Tips: ఉదయం లేవగానే టీ, కాఫీ తాగకపోతే రోజు ప్రారంభించలేనట్టు అనిపించదు చాలా మందికి. వేడి వేడి టీ, కాఫీ అలా పెదాలను తాకితే మూడ్ అంత ఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది కకాలి కడుపుతో టీ, కాఫీ (Health Tips)తాగుతుంటారు. ఇది శరీరానికి చాలా దుష్పరిణామాలు కలిగించే అలవాటు. మనం ఊహించనంత పెద్ద సమస్యలకూ కారణమయ్యే ప్రమాదం ఉంది. మరి ఆ సమస్యలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: మీకు చేపలు అంటే ఇష్టమా.. కానీ, ఈ చేపలను మాత్రం పొరపాటున కూడా తినకండి.. జాగ్రత్త సుమీ
టీ, కాఫీలో ఉండే పదార్థాలు:
- కాఫీన్
- టానిన్స్
- అసిడ్స్
కాలి కడుపుతో తాగితే వచ్చే ప్రధాన సమస్యలు:
1.అమ్లత (Acidity):
టీ/కాఫీలో ఉండే కాఫీన్, అసిడ్లు ఖాళీ కడుపులో జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది కడుపు లోపల భాగాన్ని (lining) దెబ్బతీసి జీర్ణ సంబంధిత సమస్యలు రావడానికి కారణం అవుతుంది. అసిడిటీ పెరిగి గ్యాస్, మలబద్ధకం, నొప్పులు కూడా రావచ్చు.
2.గ్యాస్ట్రిటిస్:
తరచుగా కాలి కడుపుతో టీ/కాఫీ తాగడం వలన జీర్ణకోశంలో మంట ఏర్పడవచ్చు. దీర్ఘకాలంగా చేస్తే ఇది గ్యాస్ట్రిటిస్ సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంది.
3.డీహైడ్రేషన్:
టీ, కాఫీల్లో ఉండే కాఫీన్ డైయూరెటిక్‌గా పనిచేస్తుంది. అంటే మూత్ర విసర్జన పెరగడం. దీనివల్ల శరీరం లోపలలో నీటి స్థాయి తగ్గి తలనొప్పులు, అలసట రావచ్చు.
4.ఆందోళన, మూడ్ స్వింగ్స్:
ఖాళీ కడుపులో కాఫీన్ తీసుకుంటే హార్మోన్‌లు అసమతుల్యత ఏర్పడవచ్చు. ఇది మానసిక ఆందోళన, ఉద్రిక్తత, మానసిక అస్థిరతలకు దారి తీసే ప్రమాదం ఉంది.
5.ఆయిరన్ శోషణపై ప్రభావం:
టానిన్స్, కాఫీన్ వలన ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి అందడం తగ్గుతుంది. ఇది కాలక్రమేణా అనిమియా (రక్తహీనత)కు దారితీయవచ్చు. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపించవచ్చు.
నివారణ సూచనలు:
- టీ/కాఫీ తినడానికి ముందుగా ఏదైనా తినాలి.
- ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగే అలవాటు మంచిది
- టీకి బదులుగా హెర్బల్ టీ తాగడం మంచిది
- కాఫీ/టీ తాగే సమయంలో మార్పులు.
[