పాలు, పెరుగు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. కానీ వాటిని సరైన సమయంలో తీసుకోకపోతే ప్రయోజనాల కంటే హాని ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో ఎందుకు తినకూడదు?
ఉదయం నిద్ర లేవగానే చాలా మంది వేడి పాలు తాగడం లేదా పెరుగు తినడం చేస్తుంటారు. అయితే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఉబ్బరం – అసిడిటీ: పాల ఉత్పత్తులలో ఉండే సహజమైన లాక్టిక్ ఆమ్లం ఖాళీ కడుపులోకి వెళ్ళినప్పుడు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇది కడుపు నొప్పికి కూడా దారితీస్తుంది.
యాసిడ్ రిఫ్లక్స్: పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మొత్తం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. ఖాళీ కడుపుతో తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
సరైన సమయం ఏది?
నిపుణుల ప్రకారం.. పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులను అల్పాహారం తర్వాత తీసుకోవడం మంచిది. ఉదయం ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని కూడా చెబుతారు. కాబట్టి ఖాళీ కడుపుతో కాకుండా, అల్పాహారం తర్వాత లేదా రాత్రి భోజనం తర్వాత పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా వాటి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి..
[