Google Data Center Visakhapatnam: ప్రపంచంలో ఇన్ని నగరాలు ఉండగా.. google విశాఖనే ఎందుకు ఎంచుకుంది?

Google Data Center Visakhapatnam: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరంగా, సమాచారం పరంగా, ఇతర విషయాలపరంగా మెజారిటీ ప్రజలు విశ్వసించేది గూగుల్ ను మాత్రమే.. గూగుల్ సేవల మీద ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆధారపడిన నేపథ్యంలో.. ఆ కంపెనీ మరింత విస్తృతంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. శ్వేత దేశ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా తన కార్యాలయాలను కలిగి ఉంది. హైదరాబాదులో అతిపెద్ద డాటా సెంటర్ తో పాటు సర్వీస్ సెంటర్ కూడా గూగుల్ కు ఉంది. అమెరికాలో విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ.. సొంత దేశాన్ని కాదనుకొని ముఖ్యంగా భారత్ మీద ఫోకస్ చేసింది గూగుల్. భారత్లోని ప్రధాన నగరాలలో గూగుల్ తన కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ తన డాటా సెంటర్ ను నెలకొల్పుతోంది.

Also Read: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?

వాస్తవానికి ఐటీ కంపెనీలు డాటా సెంటర్లను ప్రకృతి విపత్తులు చోటుచేసుకొని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తుంటాయి. ఎందుకంటే పొడి వాతావరణం లో డాటా కేంద్రాలు ఏర్పాటు చేస్తే కంపెనీలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డాటా కేంద్రాలలో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. ఆ సమాచారం అత్యంత భద్రంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతం దుర్భేద్యంగా ఉండాలి.. వాస్తవానికి ఐటీ కంపెనీలు ఎటువంటి విపత్తులు చోటు చేసుకోలేని ప్రాంతంలో తమ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. కానీ చరిత్రలో తొలిసారిగా గూగుల్ ఏపీలోని విశాఖపట్నంలో డాటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం 50 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం నెలకొన్న విచ్ఛిన్నకర పరిస్థితుల్లో ఈ దిగ్గజ సంస్థ ఈ స్థాయిలో డాటా సెంటర్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం.. ఒక రకంగా ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం.. శ్వేత దేశ సంస్థ డాటా సెంటర్ ద్వారా 25వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 50,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది..

ఎందుకు విశాఖ ఎంచుకున్నారు అంటే..

విశాఖపట్నం భౌగోళికంగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకునే ప్రాంతం. ఎందుకంటే విశాఖపట్నం సముద్ర తీరాన ఉంటుంది. సముద్రంలో ఏమాత్రం ఆటుపోట్లు చోటు చేసుకున్నా.. ఇంకా ఏమైనా మార్పులు జరిగినా.. ఆ ప్రభావం విశాఖపట్నం నగరం మీద ఉంటుంది. గతంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం ఏ స్థాయిలో ప్రభావితమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రకృతి విపత్తులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దిగ్గజ టెక్ సంస్థ తన సమాచార వ్యాప్తి కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం విశేషం. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దానికి కూలింగ్ కోసం నీరు భారీగా అవసరం ఉంటుందని.. అందువల్లే గూగుల్ సముద్ర తీరం ఉన్న విశాఖపట్నం నగరాన్ని ఎంచుకొని తెలుస్తోంది. పైగా ముంబైలో గూగుల్ సంస్థకు డేటా సెంటర్ ఉంది. దానికి సంబంధించిన కేబుల్స్ ను సముద్ర మార్గంలో విశాఖపట్నం తీసుకొస్తారు. అందువల్ల ఇక్కడ దిగ్గజ టెక్ సంస్థ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఐటి కార్యకలాపాలు పెరగడానికి దోహదం చేశారు. పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కావడానికి ఆయన చొరవ తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అదే దూకుడు కొనసాగిస్తున్నారు. అందువల్లే దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ విశాఖపట్నం లో కార్యకలాపాలు మొదలుపెడితే.. ఈ నగరం రూపురేఖలు మారిపోతాయి. వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. అది ఏపీ ఆదాయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

Leave a Comment