పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయి. అదే బాట లో వెండి పయనిస్తోంది. ఇలా బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే. డాలర్ విలువ తగ్గే కొద్దీ బంగారం ధర పెరుగుతుంది. అంతేకాదు మరోవైపు ప్రపంచ దేశాల్లో ట్రంప్ తెరలేపిన వాణిజ్యం యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి అనేక రకాలతో బంగారం, వెండి ధరలపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరోవైపు పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసిడి ధరలకు రెక్కలు వచ్చేశాయి. నేను సైతం అంటోంది వెండి. ఈ నేపద్యంలో ఈ రోజు ఆగస్టు 29వ తేదీ శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాలలో నేటి బంగారం ధరలు
ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరమైన హైదరాబాద్ లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 94,060 లుగా ఉంది. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 లు పెరిగి 10 రూ. 1,02,610లకు చేరుకుంది. ఇవే ధరలు విజయవాడ, విశాఖ పట్నం, పొద్దుటూరు, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10,2760లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 94,210గా ఉంది.
ఇవి కూడా చదవండి
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,02,610లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.94060గా కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ. 1,02,610లకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94060గా ఉంది. ఇవే ధరలు బెంగళూరు, కేరళ, కోల్ కతా, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఈ రోజు వెండి ధర ఎలా ఉన్నదంటే..
వెండిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీ కోసం మాత్రమే కాదు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకీ వెండిని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కూడా ఎక్కువగా వినియోగిస్తుండం పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి బాటలోనే పయనిస్తూ పై పైకి చేరుకుంటుంది. అయితే ఈ రోజు వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర స్వల్పంగా అంటే వంద రూపాయలు మేర తగ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,29,900లకు చేరుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..