Site icon Desha Disha

Drinking Expired Beer : దుబ్బాకలో బీర్ తాగి అస్వస్థతకు గురైన వ్యక్తి..

Drinking Expired Beer : దుబ్బాకలో బీర్ తాగి అస్వస్థతకు గురైన వ్యక్తి..

దుబ్బాక పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలం చెల్లిన బీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఒక వ్యక్తి రేణుక వైన్స్‌లో రెండు “బడ్వెసర్ మ్యాగ్నెమ్” బీర్లు కొనుగోలు చేసి తాగాడు. బీర్లు తాగిన వెంటనే అతనికి కడుపులో మంట మొదలైంది. అనుమానం వచ్చిన వ్యక్తి బీరుపై ఉన్న తేదీలను పరిశీలించగా.. అది అప్పటికే ఎక్స్పైర్ అయినట్లుగా గుర్తించాడు. స్థానికంగా ఉన్న హాస్పిటల్ లో చికిత్స చేపించినప్పటికీ.. కడుపు మంట తగ్గకపోగా..మరింత తీవ్రమైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని సిద్ధిపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అతనికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. కాగా ఈ ఘటనతో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, మరియు పానీయాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version