Cigarettes with Tea: సిగరెట్ స్మోక్‌ చేస్తూ.. టీ తాగే అలవాటు మీకూ ఉందా? అయితే మీ చావుకు మీరే బాధ్యులు.. – Telugu News | Smoking cigarettes with tea? Stop now, it could cause it could cause these deadly diseases

స్మోకింగ్‌.. కొందరు వదిలించుకోలేని ఒక దురలవాటు. ఒక రోజు సిగరెట్‌ తాగకపోతే.. ఏదో కోల్పోయినట్లు పిచ్చెక్కిపోతుంది. అంతగా బానిపై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నిజానికి ఈ అలవాటు ప్రమాదకరమని వారికీ తెలుసు. కానీ వెంటనే దానిని మానేయడానికి మాత్రం ఇష్టపడరు. అయితే మరికొందరు ఉంగరపు వేలు మధ్యలో సిగరెట్‌ పెట్టి స్టైలిష్‌గా పొగలు వదులుతుంటారు. మరో చేతిలో టీ కప్‌ కూడా ఉంటుంది. ధూమపానం చేసేవారిలో సగానికి పైగా ఈ అలవాటు ఉంటుంది. కానీ ఇది ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో కనీసం ఊహించలేరు. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

గుండెపోటు ప్రమాదం

అధిక ధూమపానం ఊపిరితిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అందరికీ తెలిసిందే. ఇది గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో సంకోచాన్ని కూడా కలిగిస్తుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఒకటి లేదా రెండుసార్లు తాగడం వల్ల ఎటువంటి హాని జరగదు. కానీ సిగరెట్‌ కాంబినేషన్‌లో టీ తాగితే ఖచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మిల్క్ టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌

టీతో పాటు సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం పెరుగుతుందని ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. టీలో ఉండే విషపూరిత పదార్థాలు సిగరెట్ పొగతో కలిపి క్యాన్సర్‌కు కారణమవుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఈ రెండింటి కలయిక వల్ల వంధ్యత్వం, కడుపు పూతల, జీర్ణ సమస్యలు, శ్వాస ఆడకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిసింది. ధూమపానం మంచిది కాదు. కానీ టీతో పాటు సిగరెట్లు తాగే అలవాటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఉన్న ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవడానికి ఇలాంటి అలవాట్లను తక్షణమే వదులుకోవడం మంచిది. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

[

Leave a Comment