Chiranjeevi and Jr NTR: ఆరోజు చిరంజీవి ని నమ్మనందుకు రిస్క్ లో పడిన ఎన్టీఆర్ కెరీర్.. అసలు ఏమైందంటే!

Chiranjeevi and Jr NTR: ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మరియు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ పోటీ నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నందమూరి ఫ్యామిలీ గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్న సమయం లో ఎన్టీఆర్ ఆది, సింహాద్రి లాంటి సంచలనాత్మక చిత్రాలు అందించడం తో, నందమూరి ఫ్యాన్స్ ఆయన్ని నెత్తిన పెట్టుకొని ఆరాధించారు. ముఖ్యంగా ‘సింహాద్రి’ సాధించిన విజయాన్ని చూసి, ఎన్టీఆర్ కారణంగా చిరంజీవి నెంబర్ 1 స్థానం రిస్క్ లో పడింది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా ప్రచారం అయ్యాయి. ఇంకొక్క హిట్ పడితే ఎన్టీఆర్ నెంబర్ 1 అని అనుకుంటున్న సమయం లో ఆయన నుండి ‘ఆంధ్రావాలా’ అనే చిత్రం విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ ఫ్లాప్ నుండి ఎన్టీఆర్ మళ్ళీ పైకి లెయ్యడానికి ‘యమదొంగ’ వరకు ఆగాల్సి వచ్చింది.

యమదొంగ కి ముందు ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక ఎన్టీఆర్ కి హిట్ రావడం కష్టమే అనే రేంజ్ ఫేస్ అది. అయితే ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకోవడానికి చిరంజీవి తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఆయన గుర్తించకపోవడం వల్లే అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఆరోజుల్లో పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా స్టోరీ ని ముందుగా మెగాస్టార్ చిరంజీవి కి వినిపించాడు. కానీ చిరంజీవి కి ఆ కథ అసలు నచ్చలేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ మన దగ్గర అసలు వర్కౌట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఈ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా పంతానికి పోయి ఎన్టీఆర్ ఈ సినిమా చేసాడని, అందుకే ఫలితం బెడిసికొట్టింది అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. చిరంజీవి రిజెక్ట్ చేసాడంటే కచ్చితంగా ఆ కథలో దమ్ము లేదు అనే విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ గుర్తించలేకపోయాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘ఆంధ్రావాలా’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘టెంపర్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘ఆంధ్రావాలా’ చిత్రం తో సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ ఎలా అయితే ఫ్లాప్స్ లో పడ్డాడో, టెంపర్ చిత్రం తో ఎన్టీఆర్ ఫ్లాపుల నుండి సక్సెస్ ట్రాక్ ఎక్కాడని, దేవర వరకు ఆ ట్రాక్ అలాగే కొనసాగిందని అంటున్నారు.

Leave a Comment