Site icon Desha Disha

Chandrababu Visakhapatnam: హైదరాబాద్ లా..విశాఖను మార్చేస్తోన్న బాబు

Chandrababu Visakhapatnam:  హైదరాబాద్ లా..విశాఖను మార్చేస్తోన్న బాబు

Chandrababu Visakhapatnam: హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు. ఎవరు అవునన్నా.. కాదన్నా సైబరాబాద్ నిర్మించిన ఘనత ఆయనదే. ముందుచూపుతో వ్యవహరించి ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరిపారు. వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు. భూములు కేటాయించి ప్రోత్సహించారు. అప్పటివరకు బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో మాత్రమే ఐటి అభివృద్ధి చెందింది. కార్యక్రమంలో హైదరాబాద్ సైతం ఆ జాబితాలో చేరింది. చంద్రబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ మాదిరిగానే విశాఖను సైతం ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి.

Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

* విశాఖ పై ఫోకస్..
ఏపీ ప్రభుత్వం ( AP government) విశాఖ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్ విశాఖలో అడుగుపెట్టబోతోంది. 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ గా నిలవనుంది. వాస్తవానికి అమెరికాలో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ కు ఉంది. అయితే అమెరికా వెలుపల ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లో విశాఖ అతిపెద్దదిగా నిలవనుంది. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్కు సంబంధించి.. గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చినట్లు అయింది.

* జాతీయస్థాయిలో గుర్తింపు..
విశాఖ నగరం జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇక్కడ డేటా సెంటర్( data centre) ఏర్పాటు అయితే.. మన దేశానికి చెందిన బాట ఇక్కడే నిల్వ అవుతుంది. తద్వారా డేటా సౌర్యం అనే భయం ఉండదు. ఎప్పటికీ ముంబైలో గూగుల్ కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడం సులువు. డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో ఇది సాధ్యమవుతుంది కూడా. డేటా సెంటర్కు కూలింగ్ ప్రాంతం అవసరం. అన్నింటికీ మించి నీరు కీలకం. సముద్ర తీర ప్రాంతం కావడంతో విశాఖ గూగుల్ ఎంచుకోవడానికి అదే ప్రధాన కారణం.

* 75 వేల మందికి ఉపాధి..
ఇక్కడ గూగుల్ సెంటర్( Google centre) ఏర్పాటు చేస్తే దాదాపు 25 వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. వాస్తవానికి ఐటీ రంగంలో రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుంది. ఈ లెక్కన ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెట్టుబడులను ప్రాతిపదికగా తీసుకుంటే సుమారు 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కనుంది. పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. డేటా సెంటర్ నిర్వహించాలంటే విద్యుత్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకే 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విద్యుత్ ప్రాజెక్టును సైతం ఏర్పాటు చేయనుంది గూగుల్. సముద్ర తీర ప్రాంతంలో ఉండే హైడ్రో ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ పొందాలన్న ఆలోచనలో గూగుల్ ఉంది. మొత్తానికైతే విశాఖ నగరంలో ఐటీ సంస్థలు రాక.. తాజాగా గూగుల్ డేటా సెంటర్ వస్తుండడం మాత్రం శుభపరిణామం. ఐటీ హబ్ గా విశాఖకు ఇది మహర్దశగా చెప్పుకోవచ్చు

Exit mobile version