Burial Ground Reservation: మనిషి జీవితంలో దాంపత్య బంధానిది ప్రత్యేకం. జీవించి ఉన్నప్పుడు కలిసిమెలిసి బతుకుతారు. చనిపోయాక కూడా కలిసే ఉండాలని అనుకుంటారు. అయితే అది సాధ్యం కాదు. మనిషి జనన మరణాలను నిర్ణయించేది ఆ బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాతను ఎవరు మార్చలేరు కూడా. అయితే కడపలో( Kadapa) మాత్రం దంపతుల మరణం విషయంలో ఒక మినహాయింపు ఉంది. అక్కడ ఒక వింత ఆచారం నడుస్తోంది. భార్యాభర్తలు మరణించిన తర్వాత కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో.. సమాధి స్థలాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. కడప నగరంలోని ఓ స్మశాన వాటికకు వెళ్తే.. సమాధుల పక్కన రిజర్వు అని ఒక బోర్డు ఉంటుంది. ఆసక్తికరమైన ఈ ఆచారంపై చర్చ నడుస్తోంది. అయితే స్మశానంలో రిజర్వేషన్ ఏంటి? అనేది మీ డౌట్ కదా? అందుకే ఈ స్టోరీని చదివితే అంతా అర్థం అవుతుంది.
కడప నగరంలో..
కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రి పక్కన.. క్రిస్టియన్లకు ఒక స్మశాన వాటిక( barrel ground ) ఉంది. అక్కడ సమాధుల పక్కన రిజర్వుడ్ అన్న బోర్డు కనిపిస్తుంది. రిజర్వ్ చేసినట్టుగా బోర్డులను కొందరు అసలు అక్కడ ఏం జరుగుతుందని ఆరా తీస్తారు కూడా. ఆ ప్రాంతంలో భర్త చనిపోతే భార్య స్మశానంలో ముందుగానే భర్త సమాధి పక్కనే స్థలం రిజర్వ్ చేసుకుంటున్నారట. ఒకవేళ భార్య చనిపోతే భర్త కూడా అలానే చేస్తున్నారట. ఇలా స్థలం కోసం ముందస్తుగానే రిజర్వు చేసుకున్న చోట బోర్డులు ఏర్పాటు చేస్తున్నారట. సాధారణంగా పవిత్ర గంగా నది ఒడ్డున.. కాశీలో తమ సమాధులను ముందుగానే రిజర్వ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కడపలో సైతం అదే సంస్కృతి కనిపిస్తోంది.
మరణం తరువాత కూడా బంధం..
భారతీయ వ్యవస్థలో దాంపత్య బంధానికి ఉన్న విలువ.. మరో దానికి ఉండదు. అయితే ఓ క్రిస్టియన్ స్మశానంలో ఈ సంస్కృతి ఉండడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. స్మశానంలో వారి సమాధికి ముందుగానే అవసరమైన స్థలాన్ని ఇలా రిజర్వ్ చేసుకోవడం అనేది ఒక అరుదైన ఘటన. మరణం తర్వాత కూడా పక్క పక్కనే సమాధులు ఉండేలా.. ముందు ఏర్పాట్లు చేసుకోవడం గమనించదగ్గ విషయమే. ప్రతి చిన్న విషయానికి దంపతులు గొడవలు పడే రోజులు ఇవి. మరి కొందరైతే కలిసి బతకలేమని భావించి విడాకులు కూడా తీసుకుంటున్నారు. అటువంటిది తాము చనిపోయిన కలిసి ఉండాలని భావించి ఇలా స్మశానంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం అనేది ఆసక్తికరమే.