ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. చాయ్ నుంచి షాపింగ్‌ల వరకు మొత్తం ఆన్‌లైనే. జనాలు క్యాష్ పెట్టుకోవడమే మానేశారు. యూపీఐ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో విప్లవం సృష్టించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. త్వరలో BSNL Pay పేరుతో తమ సొంత యూపీఐ సేవను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సేవ ఇప్పటికే మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సంస్థలకు గట్టి పోటీని ఇవ్వనుందని నిపుణులు భావిస్తున్నారు.
BHIM UPI ఆధారంగా బీఎస్ఎన్ఎల్ పే
బీఎస్ఎన్ఎల్ పే.. BHIM యాప్ ద్వారా శక్తివంతంగా మారనుంది. దీనివల్ల వినియోగదారులు సులభంగా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు.. బీఎస్ఎన్ఎల్ ఒక ప్రత్యేకమైన బీఎస్ఎన్ఎల్ యాప్‌ను కాకుండా.. ఇప్పటికే ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్‌లోనే ఈ చెల్లింపు సేవను అనుసంధానించనుంది. దీనివల్ల వినియోగదారులు వేరే యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే అన్ని రకాల ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించకోవచ్చు.
అందుబాటులోకి ఎప్పుడు..?
బీఎస్ఎన్ఎల్ పే ప్రారంభ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ దీపావళి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సేవ ద్వారా బీఎస్ఎన్ఎల్ తన డిజిటల్ సేవలను విస్తరించాలని, తన టెలికాం సేవలతో పాటుగా ఒక సమగ్ర చెల్లింపు వ్యవస్థను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బీఎస్ఎన్ఎల్ పే ప్రయోజనాలు
సమగ్ర సేవలు: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ పే ద్వారా అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు.
డిజిటల్ విప్లవం: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న UPI మార్కెట్‌లో BSNL కూడా ఒక ప్రధాన పోటీదారుగా నిలుస్తుంది.
ఒకే చోట: బీఎస్ఎన్ఎల్ పే సేవ BSNL Self-Care యాప్‌లోనే అందుబాటులోకి రావడం వల్ల వినియోగదారులకు సులభంగా ఉంటుంది.
ఈ నిర్ణయంతో బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించడమే కాకుండా వినియోగదారులకు మరింత మెరుగైన ఆప్షన్స్ అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..