స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా..?

Vishal gets engaged: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తమిళ హీరోలు సైతం భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు… విశాల్ లాంటి నటుడు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇక ఇప్పటివరకు విశాల్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. పందెంకోడి సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన సూపర్ సక్సెస్ ను సాధించాడు… తెలుగులో సైతం ఆ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అయింది. తెలుగులో భారీగా మార్కెట్ క్రియేట్ అయింది. దాంతో ఇప్పటి వరకు ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు… ఇక 40 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడం లేదంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సాయి ధనిషిక తో నిశ్చితార్థం చేసుకున్నాడు… విశాల్ ఈ విషయం మీద స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చెబుతూనే తనకి తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఎంగేజ్ మెంట్ అయినట్టుగా వెల్లడించాడు.

మరి తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా క్లారిటీ అయితే ఇచ్చారు.ఆయన సినిమాల్లో హీరోగా నటిస్తూనే తన పర్సనల్ కెరియర్ ను సైతం చక్కబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా హీరోగా సినిమాలను చేస్తూనే ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి క్రమంలోనే మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి ఆశించిన మేరకు విజయాలను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇక మీదట రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒకానొక సందర్భంలో విశాల్ తెలుగు హీరోలతో సైతం పోటీపడుతూ సినిమాలను చేశాడు. కానీ మధ్యలో అతనికి భారీగా ప్లాపులు రావడంతో ఆయన చాలావరకు తన మార్కెట్ ను కోల్పోయాడు…

Leave a Comment