రెండు గ్రహాలు ఒకే రాశి సంచారం వలన ,అలాగే గ్రహాల సంయోగం వలన అక్టోబర్ నెలలో మూడు యోగాలు ఏర్పడనున్నాయంట. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, మూడు రాశులవారికి మాత్రం పట్టిందల్లా బంగారమే కానుందంట. జీవితంలో ఎప్పుడూ పొందని అదృష్టం వీరి సొంతం అవుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
మిథున రాశి : మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో రాశుల సంచారం, సంయోగం వలన ఏర్పడే యోగాల ప్రభావంతో వీరికి దసర తర్వాత పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో అనేక లాభాలు అందుకొని ఆనందంగా గడుపుతారు.
మకర రాశి : మకర రాశి వారికి అక్టోబర్ నెల అదృష్ట నెలగా చెప్పాలి. వీరికి ఈ నెలలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రడు శుభ స్థానంలో ఉండటం వలన వీరి సంపద అమాంతం పెరుగుతుంది. ఆదాం పెరిగి, ఖర్చులు తగ్గిపోతాయి. వివాహ జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రానీ బాకీలు వసూలు అవుతాయి. ధనలాభ సూచన ఉంది.
ధనస్సు రాశి : అక్టోబర్ నెలలో దసర తర్వాత ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం తలుపు తట్టబోతుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా పూర్తి అవుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వీరు అక్టోబర్ నెలలో ఏ పని చేసినా అందులో విజయం వీరిదే, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
అంతే కాకుండా ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెళ్లి కుదిరే ఛాన్స్ ఉంది. అలాగే, వైవాహి జీవితం బాగుంటుంది. ఈ రాశి వారు అక్టోబర్ నెలలో భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.