Site icon Desha Disha

వామ్మో డిస్టల్ డిఫ్యూజ్ వ్యాధా… అటు చావనివ్వదు… ఇటు బతకనివ్వదు

వామ్మో డిస్టల్ డిఫ్యూజ్ వ్యాధా… అటు చావనివ్వదు… ఇటు బతకనివ్వదు

వామ్మో డిస్టల్ డిఫ్యూజ్ వ్యాధా… అటు చావనివ్వదు… ఇటు బతకనివ్వదు

కర్నూలు: మన శరీరంలో రక్తనాళాల నెట్వర్క్ చాలా విస్తృతంగా ఉంటుంది అది కింద బొమ్మలో చూపించబడింది.  ప్రతి శరీర భాగానికి కండరానికి చర్మానికి ఆక్సిజన్ తీసుకెళ్లి, కార్బన్ డయాక్సైడ్ ను బయటికి తీసుకోవడానికి ఈ నెట్వర్క్ సిస్టం ఉపయోగపడుతుంది. డయాబెటిస్ హైపర్ టెన్షన్ ధూమపానం, మద్యపానం వలన వచ్చే వ్యాధులలో మనము ఒక పెద్ద రక్తనాళం మూసుకుపోయిందని కనుగొన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము.  అప్పటికే మనకు జరిగే డ్యామేజ్ జరిగిపోయింది, దీనినే డిస్టల్ డిఫ్యూజ్ డిసీస్ అని అంటారు.  చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ ఇక మేము ఆపరేషన్ చేయలేము అని, మందులే దిక్కు, తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు మనకు మెడిసిన్ ఇంతేనా డెవలప్ అయింది అని అనిపిస్తుంది. కానీ ఈ డిస్టల్ డిఫ్యూజ్ డిసీస్ అనేది చాలా భయంకరమైనది ఇది చిన్న రక్తనాళాలను ఒక వైపు నుంచి మూసేసుకుంటూ వస్తుంది.

ధూమపానం అనేది చాలా ప్రమాదకమైనది ఇది నైట్రిక్ ఆక్సైడ్ మీడియట్ డామేజ్ వలన ఈ రక్తనాళాలు దెబ్బతినడంతో పాటు మూసుకొని పోతాయి. గుండె కుండే రక్తనాళాలైనా మెదడుకుండే రక్తనాళాలైనా కాళ్లకు చేతులకు ఉండే రక్తనాళాలైనా ఒకటి లేదా రెండు మిల్లీమీటర్ల వ్యాసం పైన ఉండే రక్తనాళాలు కు మాత్రమే బైపాస్ కానీ మందులు గాని స్టంట్ కానీ వేస్తారు.
కానీ చిన్న చిన్న రక్తనాళాలు అన్నీ కూడా మూసుకుపోయి ఉంటే ఈ బైపాస్ స్టెంట్లు కూడా వ్యర్థం, నిజంగా మనం తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఇక మనకు ఆ దేవుడే దిక్కు బతికినన్నాళ్లు బతకాలి అంతే, కావున ధూమపానం అంటే గుట్కా సిగరెట్, పాన్, కైనీ లాంటివి తీసుకోకండి. అవి చాలా ప్రమాదకరమైనవి కేవలం సినిమాలో చూపించిన యాడ్ లలో మాదిరి నోటి క్యాన్సరే కాదు అంతకంటే భయంకరమైనది ఈ డిస్టల్ డిసీస్. ఇది అటు చావనివ్వదు.. అటు బ్రతకనివ్వదు. జీవితం నరకంలా కనిపిస్తుంది.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

[

Exit mobile version