Site icon Desha Disha

వానాకాలంలో కాకరకాయ ఖచ్చితంగా తినాలట..! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. – Telugu News | Eating bitter gourd benefits in monsoon

వానాకాలంలో కాకరకాయ ఖచ్చితంగా తినాలట..! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. – Telugu News | Eating bitter gourd benefits in monsoon

అన్ని కూరగాయలలో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దూరంగా ఉంటారు. కానీ, వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో ఈ కాకరకాయ అతి ముఖ్యమైనది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కూరగాయ షుగర్‌ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా కనిపిస్తాయి.

కాకరకాయలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి, ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కాకరకాయలో చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి, విసిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను అనుకరిస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మపు చికాకుకు కారణమవుతుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

వర్షాకాలంలో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం నిర్విషీకరణ విధులను పెంచుతుంది. ఈ సీజన్‌లో కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరం నుండి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

ఇవి కూడా చదవండి

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[

Exit mobile version