Pawan Kalyan And Lokesh Kanagaraj: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లో అయినా కాంబినేషన్ తో వచ్చే సినిమాలకు విపరీతమైన హైప్ ఉంటుంది. వాటికి టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ లోనే భారీ వసూళ్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ కి అతి చేరువ అవుతుంటాయి. అందుకే నిర్మాతలు కూడా చేస్తే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీ కి చెందిన KVN ప్రొడక్షన్స్ అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు. ఈయన రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ సెట్స్ కి వెళ్లి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎదో మామూలుగా వెళ్లి కలిసి ఉంటాడులే అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన కలిసింది ఒక సినిమా చేయడానికే అట. పవన్ కళ్యాణ్ అతనికి డేట్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం.
Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి
కేవలం పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రమే కాదు, ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) డేట్స్ కూడా ఆయన వద్దనే ఉన్నాయట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇది యాక్షన్ జానర్ లో తెరకెక్కే సినిమా అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ జానర్ లో సినిమా చేస్తున్నాడంటే ఓజీ చిత్రానికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో, అలాంటి క్రేజ్ ఈ చిత్రానికి కూడా వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ మామూలు డైరెక్టర్ తో తీస్తేనే ఒక సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఇక ఏకంగా సౌత్ లో టాప్ స్థానం లో కూర్చున్న లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ తో యాక్షన్ జానర్ లో సినిమా చేస్తున్నాడంటే, ఇక ఆ అంచనాలను అందుకోవడం ఎవరికైనా సాధ్యం అవుతుందా చెప్పండి.
కేవలం అధికారిక ప్రకటన వస్తే చాలు, ఇండియా లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని చాలా కాలం క్రితం ఒక వార్త తెగ షికారు చేసింది. పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళదు, కేవలం రూమర్స్ మాత్రమే అని అభిమానులు కూడా కొట్టి పారేశారు. కానీ ఇప్పుడు నిజంగా ఈ క్రేజీ కాంబినేషన్ కార్య రూపం దాల్చనుంది. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు ఆడియన్స్ ని అలరిస్తుందో భవిష్యత్తులో చూడాలి. అయితే ఈమధ్య కాలం లో లోకేష్ కనకరాజ్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు, అందుకు రీసెంట్ ఉదాహరణ కూలీ. ఈ చిన్న భయం పవన్ అభిమానుల్లో కూడా ఉంది, ఎలా డీల్ చేస్తాడో చూడాలి మరి.