Site icon Desha Disha

రూపాయి రికార్డు స్థాయి పతనం – Mana Telangana

రూపాయి రికార్డు స్థాయి పతనం – Mana Telangana

– Advertisement –

న్యూఢిల్లీ : అమెరికా సుంకాల ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి మొదటిసారిగా ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 88 రూపాయలకు పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే దాదాపు 64 పైసలు తగ్గి, ఇప్పటివరకు కనిష్ట స్థాయి అయిన రూ.88.29కి చేరుకుంది. అయితే మధ్యాహ్నం 2:10 గంటలకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) డాలర్లను విక్రయించి రూపాయికి కొంత మద్దతు ఇచ్చింది. అది దాదాపు 88.12 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. భారతదేశంపై అమెరికా సుంకం విధించడం వల్లే రూపాయిలో ఈ పతనం జరిగిందని నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 87.95కి చేరుకుంది.

2025లో ఇప్పటివరకు రూపాయి విలువ 3 శాతం బలహీనపడి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా మారింది. శుక్రవారం చైనా యువాన్‌తో పోలిస్తే ఇది రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. భారత్‌పై అమెరికా భారీ సుంకాలు విధించడం వల్ల ఇండియా ఆర్థిక వృద్ధికి, విదేశీ వాణిజ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ వారం అమెరికా భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. దీని కారణంగా భారతదేశం మొత్తం 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.

– Advertisement –

Exit mobile version