Site icon Desha Disha

‘రామసేతు’పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

‘రామసేతు’పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

– Advertisement –

‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ ఇదివరలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణచేపట్టింది. దీనిపై స్పందన తెలుపమని కోరతూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక హోదానివ్వాలని, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలసికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని గతంలో సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా విచారణ చేపట్టారు. కాగా సుబ్రమణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది విభా మఖిజా వాదలను వినిపించారు.

రామసేతు ప్రదేశం పలువురి నమ్మకాలతో ముడిపడి ఉందని, మరోవైపు ‘సేతు సముద్రం షిప్ ఛానెల్ ప్రాజెక్ట్’ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని, తద్వారా రామసేతుకు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని సుబ్రమణ్య స్వామి మరో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. రామసేతు స్మారక చిహ్నమా, కాదా? అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్ల తరబడి నాన్చుతోందని ఆయన తన పిటిషన్‌లో ఆక్షేపించారు. కాగా నాటి ధర్మాసనం దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

– Advertisement –

Exit mobile version