– Advertisement –
నవతెలంగాణ-హైదరాబాద్: నేవీ డ్రోన్ దాడిలో ఉక్రెయిన్‌కి చెందిన అతిపెద్ద నిఘా నౌక సింఫెనీపోల్ ధ్వంసమై, మునిగిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్ మరియు ఆప్టికల్ నిఘా కోసం రూపొందించిన మధ్య తరహా నౌక, ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలో డానుబే నదిలో మోహరించి ఉండగా, డ్రోన్ ఢీకొందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఉక్రెయిన్ నేవీ నౌకను ధ్వంసం చేయడానికి మొదటిసారి ప్రయోగించిన సముద్ర డ్రోన్ పరీక్ష విజయవంతమైందని తెలిపింది.
రష్యా డ్రోన్ నౌకను ఢీకొందని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో ఒక సిబ్బంది మరణించగా, అనేకమంది గాయపడ్డారని ఉక్రెయిన్ నేవీ ప్రతినిధి తెలిపారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నారని, గల్లంతైన సిబ్బంది కోసం గాలిస్తున్నారని అన్నారు. సింఫెనీపోల్ నౌకను 2019లో ఆవిష్కరించగా, రెండు సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ నేవీలో చేరింది. 2014 తర్వాత కీవ్ ప్రయోగించిన అతిపెద్ద నౌక ఇదేనని వార్గొంజో టెలిగ్రామ్ చానల్ ప్రకటించింది.
– Advertisement –