యూజీసీ ఎల్‌ఓసీఎఫ్‌ ముసాయిదా కాపీలు దహనం

– Advertisement –

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) విడుదల చేసిన అభ్యాస ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళిక ముసాయిదా (ఎల్‌ఓసీఎఫ్‌) కాపీలను ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో దహనం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ముసాయిదాకు వ్యతిరేకంగా గురు వారం దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ, హైదరాబాద్‌ సెంట్రల్‌, పాండిచ్చేరి సెంట్రల్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కలకత్తా, ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య గుజరాత్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం సాజి పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. యూజీసీ విడుదల చేసిన ఎల్‌ఓసీఎఫ్‌ ముసాయిదా బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన విధ్వంసక నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ) రాజకీయాల్లో భాగమని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ అశాస్త్రీయ ఎల్‌ఓసీఎఫ్‌, విధ్వంసక ఎన్‌ఈపీలకు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. యువ మనస్సులను మత తత్వంలోకి నెట్టడానికి, వారి శాస్త్రీయ దృక్పథాన్ని విచ్ఛిన్నం చేసే ఏ ప్రయత్నానికైనా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. దేశంలో విద్య విధ్వంసానికి వ్యతిరేకంగా విద్యార్థి సమాజం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

– Advertisement –

Leave a Comment