Site icon Desha Disha

యాంకర్ లోబో కు ఏడాది జైలు.. సెలబ్రిటీలకు ఓ గుణపాఠం..

యాంకర్ లోబో కు ఏడాది జైలు.. సెలబ్రిటీలకు ఓ గుణపాఠం..

Anchor Lobo: విలక్షణమైన వేషధారణ.. విచిత్రమైన భాషతో బుల్లితెరపేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యుమ్. హైదరాబాద్ స్లాంగ్ తో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు ఈ యాంకర్.. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా ఇతడు పాల్గొన్నాడు. ఎంతటి ఆదరణ అయితే సొంతం చేసుకున్నాడో.. అంతే స్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే అటువంటి ఈ యాంకర్ ప్రస్తుతం ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

లోబో కు మద్యం తాగే అలవాటు ఉంది. అప్పట్లో అతడు హైదరాబాద్ వెళుతుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. 2018లో జనగామ జిల్లా నిడికొండ వద్ద లోబో ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మేడే కుమార్, పెంబర్తి మనెమ్మ దుర్మరణం చెందారు. దీంతోపాటు కారు కూడా బోల్తా పడింది. ఆ సమయంలో లోబో.. పందుల ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు.

కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లోబో వాహనం మీద పట్టు కోల్పోయాడని.. మద్యం మత్తులో ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిని పోలీసులు ధృవీకరించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏడు సంవత్సరాల తర్వాత ఈ కేసు దర్యాప్తు పూర్తి కావడంతో జనగామ కోర్టు లోబోకు ఏడాది పాటు జైలు శిక్ష.. 12,500 జరిమానా విధించింది..”జరిగిన ప్రమాదం దారుణం. ఈ ప్రమాదానికి లోబోనే కారణం. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు ఇలానే గాలిలో కలిసిపోతాయని” తుది తీర్పు చెపుతూ న్యాయమూర్తి పేర్కొన్నారు.. గతంలో కూడా లోబో అనేక వివాదాలలో తల దూర్చారు. ఆయనపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.. ఇప్పుడు ఏకంగా ఏడాదిపాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తోంది. లోబో కు న్యాయస్థానం విధించిన శిక్ష సెలబ్రిటీలకు ఒక గుణపాఠం లాంటిది.

Exit mobile version