న్యూఢిల్లీ : భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య కూడా మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి భారత్‌లో బలంగా కొనసాగనుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ తాజా అంచనా పేర్కొంది. రోడ్లు, హైవేస్ రంగంలో హెచ్‌ఎఎం ప్రాజెక్టుల ద్వారా 202728 నాటికి రూ.2 లక్షల కోట్లు అన్‌లాక్ కానున్నాయి. అయితే ప్రాజెక్టుల మందగమనంతో తాత్కాలిక ఒత్తిడి ఉండొచ్చు. విమానాశ్రయాల్లో ప్రయాణీకుల రద్దీ 2025-27లో 7 శాతం వృద్ధితో పెరుగనుంది. ఓడరేవుల్లో మొత్తం ట్రాఫిక్ 2 శాతం మాత్రమే పెరుగుతుండగా కంటైనర్లు 8 శాతం వృద్ధి సాధిస్తాయి. విద్యుత్ రంగంలో 202930 నాటికి పునరుత్పాదక వనరుల వాటా 35 శాతం పైగా చేరనుంది. బ్యాటరీ నిల్వలు, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లు (రూ.60,000 కోట్లు పెట్టుబడి) తదుపరి వృద్ధికి దారితీస్తాయి. మొత్తంగా, స్థిరమైన శక్తి-నగరీకరణ భారత ఆర్థికాన్ని నడిపించనున్నాయి.
