Site icon Desha Disha

భార్య మెడకు మిక్సీ వైర్ చుట్టి చంపేశాడు

భార్య మెడకు మిక్సీ వైర్ చుట్టి చంపేశాడు

భార్య మెడకు మిక్సీ వైర్ చుట్టి చంపేశాడు

అమరావతి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య మెడకు వైర్ చుట్టి హత్య చేశాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దుగ్గానవీధిలో రామకృష్ణ(45), త్రివేణి(38) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రామకృష్ణ మద్యానికి బానిసగా మారి భార్యను వేధించేవాడు. వచ్చిన కూలి డబ్బులతో రోజు మద్యం తాగేవాడు. బుధవారం రాత్రి మద్యం కోసం భార్యను నగదు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మిక్సీ వైరును ఆమె మెడకు చుట్టి లాగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుమారుడు, ఆమె సోదరుడు వెంటను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. భార్య మెడలోని బంగారం, నగదుతో ఇంట్లో నుంచి నిందితుడు పారిపోయాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుతున్నారు.

Exit mobile version