బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి: ఎంఏ ఎజాజ్  

– Advertisement –

నవతెలంగాణ – ఆలేరు
ఏ పార్టీలో ఉన్న బీసీ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రావాలి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ మద్దతుగా నిలవాలాని ఆలేరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ మొదటగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి కేంద్రంలో అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మాటలు తప్ప మనస్ఫూర్తిగా లేదన్నారు. రిజర్వేషన్ అమలు అయితే కాంగ్రెస్ పార్టీ రాబోయే మరో 15 ఏండ్లు పాటు అధికారంలో ఉంటుందని భయం పుచ్చుకుందన్నారు. బీసీలకు 42 శాతం ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్న ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైన కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పాలని బీసీలకు పిలుపునిచ్చారు.

– Advertisement –

Leave a Comment