Site icon Desha Disha

బిగ్ బాస్ 9' లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..ఇవేమి సెలెక్షన్స్ బాబూ!

బిగ్ బాస్ 9' లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..ఇవేమి సెలెక్షన్స్ బాబూ!

బిగ్ బాస్ 9' లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..ఇవేమి సెలెక్షన్స్ బాబూ!

Bigg Boss 9 Telugu: మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మొదలు కాబోతుంది. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీలు సాధారణమైన వాళ్ళు కాదు. ఎంతో కాలం నుండి ప్రేక్షకులకు ముఖ పరిచయం ఉన్నవాళ్ళని ఈసారి తీసుకొస్తున్నారు. వారికి పోటీగా అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులను తీసుకొస్తున్నారు. వీళ్ళ మధ్య పోటీ తారా స్థాయిలో ఉండనుంది. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఇప్పటి నుండే మొదలైంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో పాల్గొన బోయే సెలబ్రిటీల జాబితా ఇప్పటికే సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. జబర్దస్త్ ఇమ్మానుయేల్, ప్రముఖ నటుడు భరణి శంకర్, ఆశా షైనీ, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దెబ్ జానీ, శ్రేష్టి వర్మ, తనూజ గౌడ, రీతూ వర్మ, సంపత్ (ప్రముఖ విలన్) తదితరులు ఈ షో లో పాల్గొనబోతున్నారు.

Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

వీళ్ళతో పాటు ప్రముఖ హీరోయిన్ సంజన గల్రానీ(Sanjana Galrani) కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతుంది. ఈమె ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘బుజ్జిగాడు’ చిత్రం లో హీరోయిన్ త్రిష కి చెల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ కన్నడ లో మాత్రం స్టార్ హీరోల సరసన అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఈమె ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది అట. ఆ షో లో టైటిల్ గెలవలేదు కానీ, ఉన్న కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపించుకుందట. కచ్చితంగా ఈమె తెలుగు బిగ్ బాస్ లో కూడా అదరగొట్టేస్తుంది అనే నమ్మకం తోనే ఆమెని ఎంచుకున్నారట.

ఇది కాసేపు పక్కన పెడితే 2020 వ సంవత్సరం లో ఈమె మొలక ద్రవ్యాల విక్రయం కేసులో అరెస్ట్ అయ్యింది. అప్పట్లో ఆమె మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు బెయిల్ మీద బయటకు వచ్చింది. అప్పట్లో ఆమె పై నెగటివిటీ కూడా తారా స్థాయిలో ఉండేది. అయితే అదే ఏడాదిలో ఆమె బెంగళూరు కి చెందిన అజీజ్ పాషా అనే డాక్టర్ ని పెళ్లాడింది. మతాలు వేరైనా ప్రేమ తో ఒక్కటి అయ్యాం అనే సందేశాన్ని ఇస్తూ అప్పట్లో సంజనా తన భర్తతో కలిసి మక్కా ని సందర్శించడం, బూర్జా ధరించడం తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ఇక పోతే ఈమెకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండవ బిడ్డ రీసెంట్ గానే పుట్టింది. అలాంటి ఈమె బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో చూడాలి.

Exit mobile version