Site icon Desha Disha

‘బిగ్ బాస్ 9’ బజ్ హోస్ట్ గా ఎవ్వరూ ఊహించని సెలబ్రిటీ..

‘బిగ్ బాస్ 9’ బజ్ హోస్ట్ గా ఎవ్వరూ ఊహించని సెలబ్రిటీ..

Bigg Boss 9 Buzz Host: బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో, బిగ్ బాస్ బజ్ షోస్ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ప్రతీ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పాత సీజన్ కి సంబంధించిన ఒక కంటెస్టెంట్ ని హోస్ట్ గా పెట్టి, ఈ బజ్ ఇంటర్వ్యూస్ ని నిర్వహిస్తూ ఉంటారు. సీజన్ 7 కి బజ్ హోస్ట్ గా గీతూ రాయల్ వ్యవహరించగా, సీజన్ 8 కి బజ్ హోస్ట్ గా అర్జున్ అంబటి వ్యవహరించాడు. వీళ్ళిద్దరూ కూడా తమదైన స్టైల్ లో చితక్కోటేసారు. అయితే సీజన్ 9(Bigg Boss 9 Telugu) కి బజ్ హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారు?, సరిగ్గా మరో వారం రోజుల్లో సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. ఈ పాటికే బజ్ హోస్ట్ ఎవరో తెలిసిపోయి ఉండాలి కదా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే బిగ్ బాస్ 9 బజ్ హోస్ట్ కి అనేక మందిని పరిగణలోకి తీసుకున్నారట. ముందుగా టేస్టీ తేజ పేరు అనుకున్నారట, ఆ తర్వాత ప్రేరణ, విష్ణు ప్రియా, నిఖిల్ వంటి వారిని కూడా అనుకున్నారట. నిఖిల్ ని దాదాపుగా ఖరారు చేసుకుందామని అనుకున్నారు, ఆయన వైపు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ, బిగ్ బాస్ టీం మనసు మార్చుకొని సీజన్ 7 టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన శివాజీ ని సంప్రదించారట. శివాజీ కూడా ఈ షో చేసేందుకు అమితాసక్తిని చూపించాడట. వాస్తవానికి ‘అగ్నిపరీక్ష’ షోకి జడ్జిగా ముందు శివాజీ నే సంప్రదించారట. కానీ ఆయన అప్పుడు మూవీ షూటింగ్స్ తో బిజీ ఉండడం, అగ్ని పరీక్ష షో రెండు రోజుల గ్యాప్ తో షూటింగ్స్ జరుగుతుండడం తో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడట.

కానీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ కి మాత్రం ఆయన సుముఖంగానే ఉన్నాడట. శివాజీ ని సంప్రదించే ముందు యాంకర్ శ్రీముఖి ని బజ్ హోస్ట్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేశారట. కానీ చివరికి శివాజీ దగ్గర ఆగారు. అయితే బిగ్ బాస్ కి మరో క్రేజీ ఐడియా వచ్చింది. శివాజీ తో పాటు టేస్టీ తేజ కూడా బజ్ హోస్ట్ లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. శివాజీ మరియు టేస్టీ తేజ కాంబినేషన్ అంటే వెండితెర పై కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ లాంటి కాంబినేషన్ అని అనుకోవచ్చు. ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వీళ్లిద్దరి కాంబినేషన్ లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి దీని పై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version