ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి కొడుకు కూడా ఒక హీరోనే..

Ashish Vidyarthi Son Hero: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు ఆశిష్ విద్యార్థి(Ashish Vidyarthi). ఆశిష్ విద్యార్థి కెరీర్ మన తెలుగు సినిమాతోనే మొదలైంది. ‘పాపే నా ప్రాణం’ అనే చిత్రం తో కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ హీరో గా నటించిన ‘శ్రీ రామ్’ చిత్రం తో మంచి గుర్తింపు ని సంపాదించుకున్నాడు. తెలుగు మొదటి రెండు సినిమాలకు మధ్య ఆయన హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నటించాడు. ఇక తెలుగులో శ్రీ రామ్ తర్వాత ఆశిష్ విద్యార్థి నటించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, ఆశిష్ విద్యార్థి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ఇదే.

ఈ చిత్రంలో ఆయన కామెడీ విలన్ గా ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పటికీ జనాలు ఆశిష్ విద్యార్థి ని ఈ సినిమా విలన్ గానే గుర్తిస్తారు. అంతటి గొప్ప పేరు ఈ సినిమా ద్వారా ఆయనకు వచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ ఫుల్ అయిపోయాడు. అయితే ఈమధ్య కాలం లో ఆశిష్ విద్యార్థి సినిమాల్లో కనిపించడం లేదు. ఆయనకు వయస్సు మీద పడడం వల్ల దర్శక నిర్మాతలు ఆయన్ని పట్టించుకోవడం మానేశారో, లేకపోతే ఇక చాలు లే ఈ కెరీర్ అని ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడో మనకి తెలియదు కానీ, 2023 తర్వాత ఈయన నుండి మరో సినిమా రాలేదు. తెలుగు లో ఈయన నటించిన చివరి చిత్రం ‘రైటర్ పద్మనాభం’.

ఇక ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ఈయన్ని స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో టెలికాస్ట్ అవుతున్న ‘కూకూ విత్ జాతి రత్నాలు’ ప్రోగ్రాం లోనే చూడడం. ఈ షోలో ఆయన తన సతీమణి రూపాలి ని కూడా ఒక ఎపిసోడ్ లో ఆడియన్స్ కి పరిచయం చేశాడు. చూసేందుకు సినిమా హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో రూపాలి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దంపతులిద్దరికీ ఆర్త్ విద్యార్ధి అనే కుమారుడు ఉన్నాడు. ఈయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇతని గురించి గూగుల్ లో పరిశీలిస్తే ఇతను కూడా సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. చూసేందుకు అచ్చు గుద్దినట్టు తండ్రి పోలికలతో ఉన్న ఆర్త్ విద్యార్థి సినీ రంగం లోకి అడుగుపెడితే రాణిస్తాడా లేదా అనేది ఈ క్రింది ఫోటోలను చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Leave a Comment