పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఫ్యాన్స్ కు ట్రిపుల్ ధమాకా..

Pawan Kalyan Birthday: ప్రతీ ఏడాది సెప్టెంబర్ 2 వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఒక పెద్ద పండుగ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టిన రోజు కాబట్టి. ప్రతీ చోట బ్యానర్స్, కటౌట్స్, సేవ కార్యక్రమాలతో పాటు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పాత సినిమా రీ రిలీజ్, కొత్త సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఇలా ఎన్నో సర్ప్రైజ్ లు అభిమానులకు వస్తుంటాయి. వచ్చే నెల 25న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది కాబట్టి, ఈ ఏడాది సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను రెట్టింపు ఉత్సాహం తో జరిపించాలని ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఎలాగో సెప్టెంబర్ 2న ఓజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది.

Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి

ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagat singh) చిత్రం నుండి ఒక సర్ప్రైజ్ ఉంటుందని, అదే విధంగా ఆరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి జల్సా సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిల్చిన ‘తమ్ముడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మూడు సార్లు రీ రిలీజ్ అయ్యింది, ఇప్పుడు నాల్గవ సారి రీ రిలీజ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు గత ఏడాది వరకు రీ రిలీజ్ చిత్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. కానీ ఈ ఏడాది మాత్రం రీ రిలీజ్ చిత్రాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఇప్పుడు ఓజీ చిత్రం మీదనే ఉంది. ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ వేరే లెవెల్ లో ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే ఎనర్జీ ని డబ్బులని రీ రిలీజ్ కోసం ఖర్చు చేయకూడదని ఫిక్స్ అయ్యారు. సోషల్ మీడియా లో కూడా దీనిపై గట్టిగా ప్రచారం చేశారు. కాబట్టి ఈసారి జల్సా సినిమాకు రికార్డ్స్ చూడలేం అన్నమాట. మొదటి రీ రిలీజ్ లో ఈ చిత్రం ఆల్ టైం ఇండియన్ రికార్డు ని నెలకొల్పింది. దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 2న ఓజీ చిత్రం నుండి యాక్షన్ టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ టీజర్ లో అత్యధిక శాతం విలన్ ప్రపంచం పైనే ఫోకస్ పెట్టారట. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ కంటెంట్ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.

Leave a Comment