‘త్రిభాణాదారి భర్భారిక్’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా?ఫట్టా?

Tribanadhari Barbarik Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలైతే కొత్త కథలను ఎస్టాబ్లిష్ చేస్తూ రావడమే కాకుండా ప్రేక్షకులందరిని ఒక అటెన్షన్ కి గురి చేస్తున్నాయి. ఇక అలాంటి కథతో వచ్చిన సినిమానే ‘త్రిభాణాదారి భార్భారిక్ ‘.. పురాణాలలో బార్బరికుడు ఒకేసారి మూడు బాణాలు వేసి ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా సరే ముగించగలిగే కెపాసిటి కలిగిన వాడుగా మనందరికి తెలుసు… మరి అలాంటి ఒక వ్యక్తి టైటిల్ ని పెట్టుకొని ఈ సినిమాని తీయడంతోనే ఈ సినిమా మీద అందరి అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సైకాలజిస్ట్ రాము తన మనవరాలు మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇస్తాడు. ఆమె ఎలా మిస్ అయింది. లేడీ డాన్ కి, ఇతర వ్యక్తులకు ఆ అమ్మాయి మిస్సింగ్ కి మధ్య ఉన్న సంబంధమేంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు మోహన్ శ్రీవాస్త ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా నడిపించాడు. నిజానికి ఇలాంటి ఒక టిపికల్ కథతో వచ్చిన సినిమాకి స్క్రీన్ ప్లే అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తోంది. ఎక్కడ ఏ ట్విస్ట్ రివిల్ చేయాలి. ఎక్కడ ఏ సన్నివేశాన్ని రక్తి కట్టించగలగాలి అనేది స్క్రీన్ ప్లే లో భాగమవుతోంది. కాబట్టి అతను స్క్రీన్ ప్లే మీద చాలా వరకు వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది…

ఇక ఎప్పుడైనా సరే ఒక కథని భారీ రేంజ్ లో ఎలివేట్ చేయాలంటే దానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం నెక్ట్ లెవల్లో ఉండాలి. ఇక మోహన్ శ్రీవాస్త అరెండిటిని చాలా వరకు సక్సెస్ ఫుల్ గా చేసి విజయం సాధించాడు… ఫస్టాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ తో సాగే ఈ సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంతవరకు ఎమోషన్ తో ముందుకు సాగుతోంది. ఇక ప్రి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకుడికి చాలా థ్రిల్ కలిగిస్తోంది…

ఇక లీడ్ రోల్ లో చేసిన సత్యరాజ్ ఈ సినిమాని చాలావరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం కూడా చేశాడు… సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను చాలావరకు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే డ్రగ్స్ తీసుకునేవారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ప్రమాదం జరుగుతోంది అనేది చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సత్యరాజ్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకెళ్లడనే చెప్పాలి. ఉదయభాను లేడీ డాన్ గా చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేసింది.ఇక దాంతో పాటు గా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు… సత్యం రాజేష్ సైతం తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఎవరికి వారు ఈ సినిమాని ఓన్ చేసుకొని నటించారు. కాబట్టి ఈ సినిమా అవుట్ పుట్ కూడా చాలా బాగా వచ్చింది…

టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ఒకే అనిపించింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా కొన్ని ఎలివేషన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది ఇంకాస్త బెటర్మెంట్ ఉంటే బాగుండేది అనే ఫీల్ అయితే కలుగుతుంది… విజువల్స్ కూడా ఒకే అనిపించాయి. ఇలాంటి ఒక టిపికల్ స్టోరీ తో వచ్చినప్పుడు విజువల్స్ ని ఇంకొస్త గ్రాండీయార్ గా ఉంటే బాగుండేది… ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లాగైనట్టుగా అనిపించాయి. వాటిని కొంచెం కట్ చేసి ఉంటే ఇంకా సినిమా ఇంకా గ్రిప్పింగ్ గా వచ్చుండేది…

ప్లస్ పాయింట్స్
కథ
సత్యరాజ్ యాక్టింగ్
ట్విస్ట్

మైనస్ పాయింట్స్
మ్యూజిక్
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్

రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

Leave a Comment