Site icon Desha Disha

'ఢీ 20' నుండి తొలి ఎలిమినేషన్..బోరుమని ఏడ్చిన స్టార్ కంటెస్టెంట్!

'ఢీ 20' నుండి తొలి ఎలిమినేషన్..బోరుమని ఏడ్చిన స్టార్ కంటెస్టెంట్!

'ఢీ 20' నుండి తొలి ఎలిమినేషన్..బోరుమని ఏడ్చిన స్టార్ కంటెస్టెంట్!

Dhee 20 Elimination: ఈటీవీ ఛానల్ లో ప్రస్తుతం టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఎంటర్టైన్మెంట్ షో ఏదైనా ఉందా అంటే అది ‘ఢీ 20′(Dhee 20) షో మాత్రమే. ఇంతకు ముందు సీజన్స్ లో సంబంధం లేని పాటలకు సంబంధం లేని సర్కస్ ఫీట్స్ చేస్తూ ఆడియన్స్ కి తెగ చిరాకు కల్పించారు. సోషల్ మీడియా లో ఈ డ్యాన్స్ వీడియోస్ పై నెటిజెన్స్ బోలెడన్ని ట్రోల్స్ వేసేవారు. ఇలా ఈ షో నవ్వులపాలు కావడం తో టీఆర్ఫీ రేటింగ్స్ గత సీజన్ లో భారీగా పడిపోయాయి. కానీ ఈసారి సీజన్ లో మాత్రమే డ్యాన్స్ అంటే కేవలం డ్యాన్స్ మాత్రమే అని అర్థం వచ్చేలా కంటెస్టెంట్స్ కి సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లు ఉన్నాయి. అందుకే ఈటీవీ లో ఈ షో ఇప్పుడు టాప్ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి

ఇకపోతే ఈ సీజన్ కి సంబంధించిన తొలి ఎలిమినేషన్ ఎపిసోడ్ పూర్తి అయ్యిందని, మరో రెండు వారాలు తర్వాత ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మరెవరో కాదు, అన్షు రెడ్డి(Anshu Reddy). ఈమెని ఏ పద్దతి లో ఎలిమినేట్ చేశారో ప్రక్రియ కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, డేంజర్ జోన్ లో ఈమె మరియు రాజా నందిని వచ్చారని, వీళ్ళిద్దరిలో అన్షు రెడ్డి ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. ఈ షో లో ఆమె మొదటి ఎపిసోడ్ నుండి బాటమ్ 6 లోనే ఉన్నారు. ఒక్కసారి కూడా టాప్ 6 లోకి ఎంట్రీ ఇవ్వలేదు. స్వతహాగా సీరియల్ ఆర్టిస్ట్ అయినటువంటి అన్షు రెడ్డి, మిగిలిన కంటెస్టెంట్స్ లాగా, ప్రాక్టీస్ లు భారీగా చెయ్యలేదు. అందుకే ఆమె కోసం చాలా సింపుల్ గా ఉండే స్టెప్స్ ని మాత్రమే ఆమెకు సంబంధించిన కొరియోగ్రాఫర్ డిజైన్ చేస్తూ వచ్చాడు. దాని ఫలితమే ఇది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version