Site icon Desha Disha

ట్రంప్‌ కుడిచేతి వెనుక తెల్లటి మచ్చ..అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై – Telugu News | Donald Trump’s Mysterious Hand Mark Just A Bruise Or Something Bigger video – World Videos in Telugu

ట్రంప్‌ కుడిచేతి వెనుక తెల్లటి మచ్చ..అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై – Telugu News | Donald Trump’s Mysterious Hand Mark Just A Bruise Or Something Bigger video – World Videos in Telugu

ఇది చూసిన ట్రంప్‌ మద్దతుదారులు బాధపడుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్‌ చేయించుకున్న వైద్య పరీక్షల్లో ఓ దీర్ఘకాలిక సమస్య ఉన్నట్లు తెలిసింది. 79 ఏళ్ల ట్రంప్‌కు కాళ్లల్లో వాపు వచ్చినట్లు గమనించడంతో వెంటనే వైద్య పరీక్షలు చేయించగా ‘క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ’ అనే వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయింది. ఇటీవల ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్‌ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్‌ వరల్డ్‌ కప్‌ తిలకించేందుకు వచ్చిన ట్రంప్‌ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్‌ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్‌తో కవర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరీర మాంసాన్ని తినే ఈగ లార్వాలు ఈ భయానక వ్యాధితో చాలా డేంజర్

మెట్రో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం

మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే

అది ఏలియన్‌ నౌకా.. తోకచుక్కా..

Exit mobile version