Site icon Desha Disha

గుడ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయా? ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఏమంటున్నారు? – Telugu News | Can eating eggs cause gastric problems? How true is this? What do experts say?

గుడ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయా? ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఏమంటున్నారు? – Telugu News | Can eating eggs cause gastric problems? How true is this? What do experts say?

గుడ్డు అద్భుతమైన ఆహారాలలో ఒకటి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, ప్రతిరోజు ఉదయం ఉడికించిన గుడ్లు తినడం అలవాటు చేసుకోవాలని చాలా మంది నిపుణులు అంటున్నారు. గుడ్డు చిన్నగా కనిపించినప్పటికీ, గుడ్లలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి . ముఖ్యంగా గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . దీని కారణంగా , గుడ్లను అధిక పోషకమైన ఆహారంగా పరిగణిస్తారు. గుడ్లు తినడం వల్ల ఇన్ని ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వీటిని ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే గుడ్డు అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయా లేదా అనే దానిపై చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

గుడ్లు తినడం వల్ల గ్యాస్ట్రిటిస్ వస్తుందా?

కొంతమందికి గుడ్లు తిన్న తర్వాత కడుపులో గ్యాస్ వస్తుంది. (ఇది అందరితో కాదు) గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో గ్యాస్‌గా మారుతుంది. దీనివల్ల ఉబ్బరం వస్తుంది. గుడ్లలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ అధిక గ్యాస్ట్రిక్ ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఒకేసారి ఎక్కువ గుడ్లు తింటే మాత్రమే ఈ గ్రాస్ట్రిక్ సమస్య వస్తుంది.

గుడ్లు జీర్ణ సమస్యలను కలిగిస్తాయా?

కొంతమందికి గుడ్డులోని తెల్లసొన అంటే అలెర్జీ ఉంటుంది ఎందుకంటే అవి గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి. పేగులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతలో లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. కొంతమందికి గుడ్డు ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి ఎంజైమ్‌లు లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిటిక్‌ వస్తుంది. సగం ఉడికించిన లేదా పచ్చి గుడ్లు తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అవి జీర్ణం కావడం కూడా కష్టం. ఉల్లిపాయలు, బీన్స్, క్యాబేజీ వంటి గ్యాస్ట్రిక్ కలిగించే ఆహారాలతో గుడ్లు తినడం వల్ల ఈ సమస్య మరింత పెరగవచ్చు. ఈ సమస్యను తగ్గించడానికి, గుడ్లను బాగా ఉడికించాలి. పైన పేర్కొన్న వాటితో గుడ్లను కలిపి తీసుకోకూడదు.

ప్రతి వ్యక్తి శరీరం గుడ్లకు భిన్నంగా స్పందిస్తుంది. కొంతమందికి వీటిని తిన్న తర్వాత ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ కొంతమందిలో మాత్రం తక్కువ మొత్తంలో గుడ్లు తిన్న తర్వాత కూడా గ్యాస్ట్రిటిస్ వస్తుంది. కాబట్టి మీ శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకుని దానికి అనుగునంగా తినడం మంచిది.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్ట్రైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[

Exit mobile version