కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

Kotha Lokah Chapter 1 Review: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథను చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలోనే ‘కొత్తలోక చాప్టర్ 1’ అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ సైతం ఈ సినిమాకి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Also Read: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?

కథ

సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి(కళ్యాణి ప్రియదర్శిని) చాలా ప్రాబ్లమ్స్ ను హ్యాండిల్ చేస్తుంటుంది. ఇక తన అవసరం ఉందని గమనించిన వాళ్ళ గురువు గారు తనను కట్టి కి రప్పిస్తాడు. అంతకు ముందు వరకు అజ్ఞాతం లో ఉన్న ఆమెను గురువు గారు రమ్మని ఆమెకు అప్పజెప్పిన టాస్క్ ఏంటి?మరి మొత్తానికైతే ఆమె తన టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసిందా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా బోర్ అయితే లేకుండా సాగింది. ముఖ్యంగా సూపర్ మ్యాన్ కి సంబంధించిన సినిమాలను మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ ఉమెన్ కి సంబంధించిన సినిమాలను మనం చూసి ఎంజాయ్ చేస్తామని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దర్శకుడు రాసుకున్న ప్రతి సీన్ ను ఎలివేట్ చేస్తూ ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీర్చిదిద్దిన విధానం అయితే చాలా బాగుంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి సీన్లో ఒక కోర్ ఎమోషన్ ను యాడ్ చేస్తూ ఎక్కడ సూపర్ వుమెన్ ఎపిసోడ్స్ కావాలి.

ఎక్కడ ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఉండి సినిమాకి సంబంధించిన బ్యూటీని అందించాలి అనే విషయంలో దర్శకుడు చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక హాలీవుడ్ సినిమాలను మనం చూస్తూనే ఉంటాం. సూపర్ మాన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టాయి. కానీ ఈ సినిమాలో మాత్రం హాలీవుడ్ రేంజ్ ని తలదన్నుతూ చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో చాలా మంచి కథతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సినిమా మొత్తం అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ కొంతవరకు నిరాశ పెడుతోంది.

ఎందుకంటే ఈ సినిమాను యూనివర్స్ గా చేసి ఇంకా కొన్ని భాగాలను చేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని అనవసరమైన పాయింట్లను ఇందులో ఇరికించారు అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతోంది… అలా కాకుండా మొదట వాళ్ళు ఏ కథనైతే అనుకున్నారో దాన్ని స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలిచేది. అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్ గా బాగుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న నస్లేన్ ఈ సినిమాలో చాలా చక్కటి పాత్రను పోషించాడు. తన పాత్ర చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమాలోని ఎమోషన్ ని పండించడానికి చాలావరకు యూజ్ అయింది. ఇక అక్కడక్కడ కామెడీ ని కూడా పండిస్తూ నవ్వులు పూయించాడు. ఇక కళ్యాణి ప్రియదర్శిని సూపర్ ఉమెన్ గా చాలా అద్భుతంగా నటించింది.

ముఖ్యంగా ఆమె వల్లే ఈ సినిమాకి చాలా హైప్ అయితే వచ్చింది… ఆ ముఖ్యంగా వీళ్ళిద్దరి క్యారెక్టర్ల మీదనే సినిమా మొత్తం బేస్ అయ్యి ఉండటం వల్ల వీళ్ళు ఆ సినిమాకి ప్రాణం పోసి మరి నటించారు. మొత్తానికైతే ఈ సినిమాతో వీళ్ళు ఒక మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారనే చెప్పాలి. మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ చాలా అద్భుతంగా కుదిరింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో జోక్స్ బోజే చాలా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి సీన్ లో ఏదో ఒక ఎమోషన్ ని హైలెట్ చేయడానికి ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల సినిమా మీద భారీ అంచనాలు రావడమే కాకుండా ప్రతి సీన్ మనకు ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది…మొత్తానికైతే మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా అందించారు… ఇక సినిమాటోగ్రాఫర్ నిమిష రవి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి విజువల్స్ అందించాడు. దర్శకుడు ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని పూర్తిగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు హెల్ప్ చేశాడు… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

కథ
విజువల్స్
మ్యూజిక్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

ప్రీ క్లైమాక్స్
కొన్ని అనవసరమైన సీన్స్

రేటింగ్

ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

 

Leave a Comment