Site icon Desha Disha

ఓడిపోయినోడ్ని 'అగ్నిపరీక్ష' కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!

ఓడిపోయినోడ్ని 'అగ్నిపరీక్ష' కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!

ఓడిపోయినోడ్ని 'అగ్నిపరీక్ష' కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!

Bigg Boss Telugu 9 Agnipariksha Kaushal: బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లోకి సామాన్యులను కంటెస్టెంట్స్ గా పంపే ప్రక్రియ లో భాగంగా ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) అనే షో ని నిర్వహించిన సంగతి తెలిసిందే. గత 8 రోజుల నుండి ఈ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకి ఆరంభం లో ఆడియన్స్ నుండి కాస్త వ్యతిరేకత వచ్చినా, ఆ తర్వాత ఆసక్తికరమైన టాస్కులతో కంటెస్టెంట్స్ చేత ఆడిస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఈ షోలో బిగ్ బాస్ టీం నవదీప్ ని జడ్జిగా ఎంచుకున్నందుకు బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు రేపుతున్నాయి. నవదీప్ పై ఏడుపులు ఎందుకు అని కౌశల్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు కూడా. ఇంతకు ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం.

Also Read: ఏఎం రత్నం తో పవన్ కళ్యాణ్ మరో సినిమా..ఈసారి డైరెక్టర్ ఎవరంటే!

ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్యనే బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ సీజన్ ప్రారంభం అయ్యింది.అంతా బాగానే ఉంది, రౌడీస్ షో తరహాలో సామాన్యులను పెట్టి హౌస్ లోకి పంపే ప్రక్రియ బాగుంది. కానీ జడ్జిల విషయం లోనే చిన్న సమస్య ఉంది. అభిజిత్, బిందు మాధవి లు టైటిల్ గెలిచారు, వాళ్ళని పిలవడం లో ఎలాంటి సమస్య లేదు, కానీ నవదీప్ గారిని పిలవడమే కొద్దిగా తేడాగా ఉంది. ఆయన బిగ్ బాస్ సీజన్ 1 లో టాప్ 3 గా నిలిచారు అనుకుంట. ఆ మూడవ జడ్జిని కూడా మొదటి సీజన్ విన్నర్ అయినటువంటి శివబాలాజీ గారినే పిలిచి ఉంటే బాగుండేది. ఇక నా విషయానికి వస్తే, తెలిసిందే కదా మాది చాలా పెద్ద కాంట్రవర్షియల్ సీజన్. బిగ్ బాస్ టీం కి నేను ఇష్టం లేకపోయినా, భారీ ఓటింగ్ ఉండడం వల్ల నన్ను బలవంతంగా గెలిపించాల్సి వచ్చింది’.

‘ఆడియన్స్ మొత్తం నా వెంట ఉండడం వల్ల వాళ్లకు ఇష్టం లేని కంటెస్టెంట్ ని అయిన నన్ను గెలిపించారు కాబట్టే, బిగ్ బాస్ టీం నేను గెలిచిన తర్వాత పూర్తిగా దూరం పెట్టేశారు. నన్ను ఏ బిగ్ బాస్ సీజన్ కి మళ్ళీ పిలవలేదు, అదే విధంగా బిగ్ బాస్ కి సంబంధించిన ఏ ప్రోగ్రాం కి కూడా నన్ను దూరం పెట్టారు. కానీ నేను ఇవన్నీ పట్టించుకోను. నేను న్యాయంగా ఆడి టైటిల్ గెలిచాను, ఆడియన్స్ మనసుల్ని కూడా గెలుచుకున్నాను. ఇక అగ్నిపరీక్ష విషయానికి నన్ను పిలవకపోయినా, కనీసం బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ విన్నర్ శివ బాలాజీ ని పిలిచి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ ఇష్టం కదా, జరిగింది ఎదో జరిగింది, ఒక మంచి పవర్ ఫుల్ కామన్ మ్యాన్ బిగ్ బాస్ 9 లోకి అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కౌశల్.

Exit mobile version