Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో 26 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, మూవీ లవర్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత తన రేంజ్ కి తగ్గ సినిమా చేస్తున్నాడు అనే భావన అందరిలో కలిగింది కాబట్టి. దానికి తోడు ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, రీసెంట్ గా విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఆడియన్స్ లో ఆ అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి. అందుకు నిదర్శనం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అని చెప్పొచ్చు. నార్త్ అమెరికా లో బుకింగ్స్ ని ప్రారంభించిన రెండు రోజులకే ఈ చిత్రం మూడు లక్షల డాలర్లను రాబట్టింది.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
చూస్తుంటే నార్త్ అమెరికా లో ఆల్ టైం రికార్డు ప్రీమియర్ గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఈ చిత్రం లో హీరోయిన్ క్యారక్టర్ కోసం ముందుగా ప్రియాంక మోహన్ ని సంప్రదించలేదట. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల నుండి కొనసాగుతున్న దీపికా పదుకొనే ని హీరోయిన్ రోల్ కోసం సంప్రదించారట. దీపికా పదుకొనే ఈ క్యారక్టర్ చేయడానికి ఒప్పుకుంది కానీ, అందుకోసం ఆమె ఏకంగా 16 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. మేకర్స్ పది కోట్లు ఇవ్వడానికి రెడీ, కానీ దీపికా 16 కోట్ల రూపాయిల నుండి తగ్గకపోవడం తో ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించే ఛాన్స్ మిస్ అయ్యింది.
వీళ్లిద్దరి కాంబినేషన్ ఇప్పుడే కాదు, గతం లో కూడా మిస్ అయ్యింది. పులి సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ ఎందుకో కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం పట్టాలు ఎక్కలేదు. ఒకవేళ ఓజీ చిత్రం లో దీపికా పదుకొనే నటించి ఉండుంటే బాలీవుడ్ లో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండేది. ఎందుకంటే దీపికా పదుకొనే కి బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి కూడా. ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదు, దీపికా పదుకొనే ని రిస్క్ చేసి ఓజీ మేకర్స్ తీసుకోవాల్సింది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.