ఐదేళ్లపాటు పరిహారం

ఐదేళ్లపాటు పరిహారం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల వల్ల ఏటా రూ. 2 ల క్షల కోట్ల ఆదాయం నష్టపోయే అవకాశం ఉందని, అందువల్ల ప్రత్యామ్నాయంగా అన్ని రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు శు క్రవారం డిమాండ్ చేశాయి. పన్ను రేటు తగ్గింపు తర్వాత వ్యాపారాలు గిట్టుబాటు గా ఉండే విధంగా రక్షణ కల్పించడానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని 8 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు కోరారు. దీనివల్ల సామాన్యులకు కేంద్రం ఆశించిన ప్రయోజనాలు చేరతాయని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల మం త్రులు ఈ మేరకు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పన్ను రేటు కొనసాగించడానికి ప్రతిపాదించిన 40 శాతం రేటుకు అదనంగా, విలాస వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని ఈ రాష్ట్రాలు సూచించాయి. ఈ లెవీ
నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3,4 తేదీలలో కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన,అన్ని రాష్ట్రాల మంత్రులతో కూడిన జిఎస్టీ కౌన్సిల్ ముందు ఈ రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను సమర్పించనున్నారు.

ప్రస్తుతం 5,12,18 , 24 శాతం – నాలుగు శ్లాబ్ ల వ్యవస్థను, జిఎస్టీని 5,18 శాతం లతో కూడిన రెండు అంచెల వ్యవస్థగా మార్చాలని, అదనంగా పరిహార సెస్సును విధించాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది.కేంద్రం ప్రతిపాదన ప్రకారం, వస్తువులు సేవలను, వాటి నాణ్యత, ప్రమాణాలను బట్టి 5, 18 శాతం పన్ను విధిస్తారు. 40 శాతం స్లాబ్ ను కూడా కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ స్లాబ్ కింద కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక ఉత్పత్తులు, అల్ట్రా- లగ్జరీ వస్తువులను చేర్చాలని నిర్ణయించారు. అయితే, ఈ రేటు కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని కేంద్రం అంచనా వేయలేదు. 8 రాష్ట్రాల సమావేశం తర్వాత కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణ బైరే గౌడ విలేకరులతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రం ప్రస్తుత వస్తువులు, సేవల పన్ను(జిఎస్టీ) ఆదాయంలో 15- 20 శాతం నష్టపోతున్నదని అంచనా వేస్తున్నారని తెలిపారు. రేటు తగ్గింపు తర్వాత పన్ను ఆదాయం వృద్ధి పెరుగుతుందనే వాదనను ఆయన తిరస్కరించారు. 20 శాతం జిఎస్టీ ఆదాయం నష్టం వల్ల దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా అస్థిరం పాలవుతుందని బైరే గౌడ అన్నారు. ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు కనీసం ైదు సంవత్సరాలు పరిహారం చెల్లించాలని ఆదాయాలు స్థిరీకరణ జరిగేవరకూ పరిహారం పొడిగించాలని కూడా కర్ణాటక మంత్రి వివరించారు.

Leave a Comment