ఆడవారి వయసు.. మగవారి జీతం.. ఎందుకు అడగకూడదు?

ఆడవారి వయసు.. మగవారి జీతం.. ఎందుకు అడగకూడదు?

Chanakya Niti: పెద్దలు చెప్పే కొన్ని విషయాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. కానీ వాటిలో పరమార్ధం తాగి ఉందని కొందరు మాత్రమే గుర్తిస్తారు. ఎంతోమంది జీవితాలను చూసిన తర్వాత వారు ఇలాంటి విషయాలను బయటకు చెప్పారు. వాటిలో ఆడవారి వయసు బయటకు చెప్పకూడదు.. మగవారి జీతం కూడా ఇతరులకు వెల్లడించరాదు.. అనేది చాలాసార్లు వినే ఉంటాం. అయితే ప్రస్తుత కాలంలో దీనిని చాలామంది పట్టించుకోవడం లేదు. కానీ ఇందులో ఎంతో అర్థం తాగే ఉందని చాణక్య నీతి చెబుతోంది. జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు చెప్పిన చాణక్యుడు దీని గురించి కూడా పూర్తిగా వివరించాడు. అదేంటంటే?

ఆడవారి వయసు బయటకు చెప్పకూడదు.. ఆడవారు ఎప్పుడు తమ కోసం కాకుండా కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి అప్పుడు వీరికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో సమాజంలో గుర్తింపు కోసం కూడా వీరు ఆరాటపడతారు. అందువల్ల తమ వయసు ఎక్కువ చెబితే తమ పరువుకు భంగం వాటిలే అవకాశం ఉంటుందని భావిస్తారు. వయసు ఎక్కువగా చెప్పడం వల్ల కొన్ని పనులు పూర్తికావని అనుకుంటారు. అందుకే వారు తమ వయసు గురించి బయటకు చెప్పకుండా ఉంటారు. అయితే రాను రాను పెద్దలు సైతం వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఇలా వారిని వయసు గురించి అడగొద్దని చెప్పారు.

మగవారి జీతం గురించి చెప్పకూడదు.. మగవారు పనిచేసేది తమకోసం కాదు. డబ్బు సంపాదించేది కుటుంబం కోసమే. ఇలాంటి సమయంలో తన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా వెల్లడిస్తే కొన్ని విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తమకు జీతం ఎంత వస్తుంది? ఎంత డబ్బు ఉంది? అనే విషయాలను బయటికి చెప్పడం వల్ల ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మగవారు ఎక్కువగా ఫీల్డ్ లో ఉంటారు. ఇలాంటి సమయంలో వారి ఆర్థిక పరిస్థితి గురించి తెలిస్తే డబ్బు ఇచ్చేవారు వెనుకాడుతారు. అందువల్ల మగవారి జీతం గురించి అడగకూడదు అని చెబుతూ ఉంటారు.

ఇలా మరికొన్ని విషయాలు కూడా జీవితానికి సంబంధించినవే అయి ఉంటాయి. అందుకే ఇలాంటి విషయాలు పెద్దలు పకడ్బందీగా ఇతరులకు చెప్పకూడదు అని అంటారు. ఇవే కాకుండా స్రీ, పురుషులు ఎవరైనా కొన్ని ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన విషయాలను ఇతరులకు చెప్పకుండా ఉండడమే మంచిది. రహస్యాలను బయట పెట్టడం ద్వారా తమ పరువుకు భంగం ఏర్పడి జీవితం లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఉద్యోగం, వ్యాపారం చేసేవారు సైతం తాము ఏం చేస్తున్నది.. ఇలాంటి పెట్టుబడులు పెట్టింది.. అనే విషయాలను కూడా బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుకోవాలి. ఇలాంటి విషయాలు బయట పెడితే ఎదుటివారి నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవారు సైతం తమ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇతరులకు చెప్పకుండా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించుకోవాలి.

[

Leave a Comment