రోజురోజుకూ వీధి కుక్కల బెడ పెరిగిపోతుంది. ఎంతగా చర్యలు తీసుకుంటున్నా రోజూ ఎక్కడో అక్కడ ఈ వీధికుక్కలు జనాలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా కొందరు గాయాలపాలవుతుంటే.. మరి కొందరూ ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో వెలుగు చేసింది. వినాయక చవితి సందర్భంగా గణేషుడిని చూసేందుకు వచ్చిన మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరు మండలం కడివేళ్ల గ్రామానికి చెందిన బడేసాబ్ అనే మూడేళ్ల బాలుడు గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా వినాయకుడుని చుడానికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడే ఉన్న కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపైకి దూసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన బాలుడు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆ వీధికుక్క బాలుడిపై పడి విచక్షణ రహితంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి.
అయితే బాలుడిపై కుక్కలు దాడి చేయడం గమనించిన గ్రామస్తులు వెంటనే వాటిని బెదించింది. బాలుడిని కాపాడారు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. అయితే గతంలో కూడా గ్రామంలో చాలామందిపై ఈ కుక్కలు దాడి చేశాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై అధికారులు స్పందించి కుక్కలు బెడద నుండి తమను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.