Site icon Desha Disha

అత్యద్భుతమైన కథతో ‘మిరాయ్‌’

అత్యద్భుతమైన కథతో ‘మిరాయ్‌’

హీరో తేజ సజ్జా మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌-ఇండియా సూపర్‌ హీరో విజువల్‌ వండర్‌ ‘మిరాయ్‌’. ఇందులో ఆయన సూపర్‌ యోధ పాత్రలో అలరించబోతున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మనోజ్‌ మంచు పవర్‌ఫుల్‌ పాత్ర పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్‌, టీజర్‌, బిటిఎస్‌ వీడియో ‘వైబ్‌ ఉంది’ సాంగ్‌ సినిమాపై మ్యాసీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. అందరిలో మరింత ఎగ్జైట్‌మెంట్‌ని పెంచుతూ మేకర్స్‌ గురువారం ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, ‘హనుమాన్‌’ రిలీజ్‌ కంటే ముందు ఈ సినిమాని కమిట్‌ అయ్యాను. నేను ఈ సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్‌ పెట్టాను. ఈ సినిమాలో ఎలివేషన్‌ మూమెంట్స్‌ మామూలుగా ఉండవు. చాలా గూస్‌ బంప్స్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. విశ్వప్రసాద్‌ చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. మనోజ్‌తో స్క్రీన్‌ స్పేస్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్ప కథ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా తల్లీకొడుకుల భావోద్వేగాలు అందర్నీ అలరిస్తాయి. పిల్లలు, ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది’ అని తెలిపారు.
‘ఇంత అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్‌ 12న అందరూ థియేటర్స్‌లో సినిమాని చూసి ఎంజారు చేస్తారని కోరుకుంటున్నాను’ అని నిర్మాత కృతి ప్రసాద్‌ చెప్పారు.
డైరెక్టర్‌ కార్తీక్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా ట్రైలర్‌ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. చాలా సిన్సియర్‌గా తీసిన సినిమా ఇది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘ఇంత అద్భుతమైన సినిమా తీసిన కార్తీక్‌కి థ్యాంక్స్‌. ఇందులో చాలా మంచి రోల్‌ చేశాను. చాలా పవర్‌ఫుల్‌ సినిమా ఇది’ అని నటి శ్రియా చెప్పారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ, ‘పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది’ అని తెలిపారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ సూపర్‌గా ఉంది. తేజ ‘జాంబిరెడ్డి’ సినిమాకి మేము రాయలసీమ డిస్ట్రిబ్యూట్‌ చేశాం. ‘హనుమాన్‌’ నైజం డిస్ట్రిబ్యూట్‌ చేశాం. ఇప్పుడు ‘మిరాయ్‌’ను నైజాం, చిత్తూరు జిల్లా కూడా చేస్తున్నాం. ఈ సినిమా చాలా అద్భుతమైన స్థాయిలో ఆడుతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.

‘మిరాయ్‌’ పై చాలా కలలు, ఆశలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఇందులో చాలా పవర్‌ఫుల్‌ రోల్‌ చేశా. నా జీవితంలో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ‘హనుమాన్‌’ లాంటి హిట్‌ అందుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ, తేజ ‘మిరాయ్‌’ కోసం మరొక ప్రాజెక్ట్‌ అంగీకరించకుండా మూడేళ్లు వేచి చూశాడు. అది మామూలు విషయం కాదు. తను జీవితంలో ఇంకెంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను. కానీ, కార్తిక్‌ని కలిసిన తర్వాత నాకు ఏమీ తెలియదని అర్థమైంది. అశోకుడు రాసిన 9 పుస్తకాల గురించి ప్రపంచానికి చెప్పాలనే సంకల్పంతో దీన్ని అద్భుతంగా రూపొందించారు. సినిమాని ఇంటర్నేషనల్‌ స్థాయిలో తీశారు. నిర్మాత విశ్వప్రసాద్‌, వాళ్ళ పాప కృతి ప్రసాద్‌ దీన్ని ఎంతో ప్యాషనేట్‌గా నిర్మించారు.
– మంచు మనోజ్‌

The post అత్యద్భుతమైన కథతో ‘మిరాయ్‌’ appeared first on Navatelangana.

Exit mobile version