Site icon Desha Disha

Viral Video: వావ్… 72 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలె… దుబాయ్‌ రోడ్ల మీద రోల్స్ రాయిస్‌లో చక్కర్లు కొట్టిన కేరళ వృద్ధురాలు – Telugu News | Viral video 72 year old indian woman driving rolls royce in dubai video goes viral online watch the viral clip online

Viral Video: వావ్… 72 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలె… దుబాయ్‌ రోడ్ల మీద రోల్స్ రాయిస్‌లో చక్కర్లు కొట్టిన కేరళ వృద్ధురాలు – Telugu News | Viral video 72 year old indian woman driving rolls royce in dubai video goes viral online watch the viral clip online

వయసు అనేది కేవలం సంఖ్య అని మాత్రమే చెప్పడానిక ఈ వృద్దురాలు ఓ సరికొత్త ఉదాహరణ. 72 ఏళ్ల భారతీయ మహిళ మణి అమ్మ దుబాయ్ వీధుల్లో రోల్స్ రాయిస్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఈ వృద్ధ మహిళ చీర ధరించి ఉంది. పూర్తి నమ్మకంతో తెల్లటి రోల్స్ రాయిస్‌ కారును నడుపుతున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఆ వృద్ధ మహిళ శైలిని, ధైర్యాన్ని నెటిజన్స్‌ ప్రశంసిస్తున్నారు.

మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్‌ అభివర్ణిస్తున్నారు. ఆమె కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం, ఆమెకు 11 రకాల వాహనాలను నడపడానికి లైసెన్స్ ఉంది. ఆమె లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్‌కవేటర్లను కూడా చాలా సులభంగా నడుపుతుంది.

‘డ్రైవర్ అమ్మ’ వీడియోలను చూసిన తర్వాత, నెటిజన్లు ఆమెను ‘వయస్సు కేవలం ఒక సంఖ్య’ అనే దానికి గొప్ప ఉదాహరణగా అభివర్ణించారు. అదే సమయంలో హృదయపూర్వక ఎమోజీల వర్షం కురిపించారు. 1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది.

వీడియో చూడండి:

గత సంవత్సరం, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా డ్రైవర్ అమ్మ కథను X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు.

Exit mobile version