
చెన్నైలో పుట్టి పెరిగాడు అర్జున్ దాస్. 2015లో ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయైన అర్జున్ దాస్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఈ నటుడు ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ తో అతను ప్రేమలో ఉన్నాడంటూ రూమర్లు వినిపిస్తుంటాయి. సదరు హీరోయిన్, తాము మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో అర్జున్ దాస్ ఆ క్రేజీ హీరోయిన్ కలిసి నటిస్తున్నారు. దీంతో మరోసారి వీరి లవ్ రూమర్లు నెట్టింట వైరలవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉండటం వల్లే కలిసి వెబ్ సిరీ్‌సలో నటించారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అర్జున్ దాస్ పడిపోయింది ఎవరికో తెలుసా? హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మట్టి కుస్తీ తో పాటు పలు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన ఈ అందాల తారతో అర్జున్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు సినిమాలో నటిస్తోంది.