Site icon Desha Disha

Today Horoscope: వారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | August 28 Daily Horoscope in Telugu: Career growth, financial gains, family harmony

Today Horoscope: వారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | August 28 Daily Horoscope in Telugu: Career growth, financial gains, family harmony

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు వృద్ది చెందు తాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలతో లబ్ది పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం, పురోగతి చెందడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యో గాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగు తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదా విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవు తుంది.  ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయ వృద్ధికి, ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగా నికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగాలు మారా లనుకుంటున్నవారికి కూడా మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తి గత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయపరంగా సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజ యవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమ స్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవి తంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలోశుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు లాభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఆశించిన శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది.వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగి పోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. చిన్న నాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాభవంతో పాటు ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు.  ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు పొందుతారు. వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ఆదాయానికి లోటు లేనప్పటికీ, ఆర్థికంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. లాభాలపరంగా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభిస్తుంది.

Exit mobile version