Site icon Desha Disha

TDP Vs YCP: వైసీపీకి నేర్పిన టిడిపి గుణపాఠం ఇదీ

TDP Vs YCP: వైసీపీకి నేర్పిన టిడిపి గుణపాఠం ఇదీ

TDP Vs YCP: వైసీపీకి నేర్పిన టిడిపి గుణపాఠం ఇదీ

TDP Vs YCP: రాజకీయాలు అన్నాక సరైన వ్యూహాలు ఉండాలి. ఆ వ్యూహాలతోనే ప్రత్యర్ధులపై ఉక్కు పాదం మోపాలి. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా? టిడిపి కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా? అనే చర్చ బలంగా నడుస్తోంది. అయితే అనుభవ రాహిత్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కనిపించింది. టిడిపి కూటమి ప్రభుత్వంలో మాత్రం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతల అణచివేత కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలోనూ టిడిపి నేతల అరెస్టులు జరిగాయి. చివరకు మాజీ సీఎం చంద్రబాబు కూడా అరెస్టు అయ్యారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతల అరెస్టు పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ప్రస్తుతం పక్కా ఆధారాలతో పట్టు బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. దూకుడు కలిగిన నేతలు సైతం అరెస్టు జరిగిన తర్వాత.. జైలులో ఉన్న పరిస్థితులను చూసి గడగడలాడిపోతున్నారు.

Also Read: విశాఖలో పవన్ పెద్ద గేమ్ ప్లాన్!

* తాజా మాజీ మంత్రులపై కేసులు..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. ఎటువంటి ప్రతీకార రాజకీయాలు ఉండవని సీఎం అయిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ అక్కడికి కొద్ది రోజులకే తాజా మాజీ మంత్రులు, టిడిపి నేతల అరెస్టుల పర్వం ప్రారంభం అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. వారి వ్యాపారాలపై దాడులు మొదలయ్యాయి. దీంతో చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. శ్రీకాకుళంలో అచ్చెనాయుడు నుంచి అనంతపురంలో జెసి ప్రభాకర్ రెడ్డి వరకు ఎవ్వరిని విడిచిపెట్టలేదు. చివరకు టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబును విడిచిపెట్టలేదు. అయితే అరెస్టుల వరకు సక్సెస్ అయ్యింది కానీ.. వారిపై మోపిన కేసుల విషయంలో ఆధారాల సేకరణ, లోతైన విచారణ మాత్రం జరగలేదు. ఇలా జైలుకు వెళ్లి.. అలా బయటకు వచ్చేసేవారు టిడిపి నేతలు. ముఖ్యంగా అప్పట్లో పనిచేసిన యంత్రాంగం, అధికారుల్లో ఆశించిన స్థాయిలో పట్టు లేకపోయింది. అదే సమయంలో ఆధారాలు కూడా లభించలేదు.

* పక్కా ఆధారాలతో
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార రాజకీయాలు లేవు అని చెప్పలేం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన నేతలు విషయంలో మాత్రం రెడ్ బుక్( red book ) తన పని తాను చేసుకుని పోతోంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రస్తావించాలి. వైసీపీ హయాంలో హుందాగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి నేతల జోలికి కూటమి ప్రభుత్వం వెళ్లక పోవడాన్ని గుర్తించుకోవాలి. అదే సమయంలో అరెస్ట్ అయిన నేతల విషయంలో కూటమి తన సీనియారిటీని, సిన్సియారిటీని ప్రదర్శిస్తోంది. జైలుకు వెళ్లడమే కానీ బెయిల్ రావడం చాలా కష్టం. దాదాపు అరెస్ట్ అయిన వైసీపీ నేతల పరిస్థితి అలానే ఉంది. వల్లభనేని వంశీ మోహన్ అయితే మూడు నెలల పాటు జైల్లో ఉండి పోయారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి అదే. పోసాని కృష్ణమురళి ఏకంగా కోర్టులోనే రోదించారు. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే. జైలుకు వెళ్లడమే కానీ బెయిల్ దొరకడం చాలా కష్టం అవుతుంది. అలాగని చట్టపరంగా కూడా కేసుల్లో నిందితులకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతోంది. కోర్టుల్లో అపీల్ చేసేందుకు అవకాశం కూడా ఇస్తున్నారు. అయితే పక్కా ఆధారాలతో, లోతైన విచారణతో పట్టు బిగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కేసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు.. వైసిపి హయాంలో జరిగిన దానికి భిన్నం. స్వయంగా అరెస్టు అవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ విషయంలో షాక్ అవుతున్నారు.

* తేలిగ్గా తీసుకున్న వైసిపి..
మద్యం కుంభకోణం( liquor scam ) కేసును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. అసలు ఏమీ జరగదని ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు జగన్ కు కూత వేటు దూరంలో అరెస్టులు నిలిచాయి. ఒకవైపు విచారణ కొనసాగుతుండగా.. మద్యం కుంభకోణం నిందితుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సుప్రీం కోర్టు వరకు వెళ్లి బెయిల్ పొందలేకపోయారు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్. చివరకు నాలుగు వారాల్లోగా సిఐడి కి లొంగి పోవాలని సుప్రీంకోర్టు ఆయనకు ఆదేశాలు ఇచ్చిందంటే.. విచారణలు, ఆధారాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. కేవలం అరెస్టులకే పరిమితం అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టులతో పాటు రోజుల తరబడి వారు జైల్లో ఉండేలా విచారణలను కొనసాగిస్తోంది. ఈ విషయంలో మాత్రం కూటమి గ్రేట్.

Exit mobile version