Site icon Desha Disha

Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇవి తినండి చాలు.. వెంటనే బజ్జుంటారు.. – Telugu News | These are the 6 magnesium rich foods you should eat for better sleep

Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇవి తినండి చాలు.. వెంటనే బజ్జుంటారు.. – Telugu News | These are the 6 magnesium rich foods you should eat for better sleep

బాగా నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. దాని కోసం నిద్ర మాత్రలకు బదులుగా సహజమైన మార్గాలను అనుసరించడం మంచిది. ఈ క్రమంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు మంచి నిద్రకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెగ్నీషియం మన శరీరానికి ఎంతో అవసరం. ఇది నరాల కణాలను శాంతపరచి, కండరాలను సడలించి, మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. సెరోటోనిన్, తరువాత మెలటోనిన్‌గా మారుతుంది.

బీన్స్

బీన్స్‌లో ప్రొటీన్స్‌తో పాటు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

పాలకూర

పాలకూరలో ఉన్న పోషకాలు శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకువచ్చి, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడతాయి.

బాదం

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మనసుకు ప్రశాంతతను అందించి, మంచి నిద్రకు తోడ్పడుతుంది.

అరటిపండు

అరటిపండ్లలో మెగ్నీషియంతో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఈ రెండూ ఆందోళనను తగ్గించి, నిద్రకు సహాయపడతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు అరటిపండు తినడం మంచిది.

గుమ్మడి గింజలు

గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతపరిచి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఈ ఆహారాలను మీ రోజువారీ ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా మీరు నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. నిద్రకు సహజమైన పరిష్కారాలను ఎంచుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఇతర దుష్ప్రభావాలను కూడా నివారించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి..

[

Exit mobile version